జాతీయ వార్తలు

తెలంగాణకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ఏపి పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 10లో పేర్కొన్న సంస్థలను విభజనలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని తెరాస ఎంపీలు విజ్ఞప్తి చేశారు. తెరాస ఎంపీలు జితేందర్‌రెడ్డి, కవిత, బీబీ పాటిల్ సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా విభజన చట్టంలో ఇప్పటికి రెండు రాష్ట్రాల మధ్య కొలిక్కిరాని షెడ్యూల్ 10లో పేర్కొన్న సంస్థల విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలని కోరారు. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తీసుకున్న చర్యలే ఇప్పుడు కొనసాగించాలని హోం మంత్రిని ఎంపీలు కోరారు. ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రాలకే చెందేలా చూడాలని టిఆర్‌ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు.