జాతీయ వార్తలు

అంచనా దాటితే మీరే భరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్‌లో వేసిన అంచనా ప్రకారం అయ్యే నీటిపారుదల ఖర్చును మాత్రమే కేంద్రం భరిస్తుంది, అంచనాకు మించి అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు అడిగిన మూల ప్రశ్నకు ఉమాభారతి సోమవారం రాజ్యసభలో సమాధానం ఇస్తూ ఈ విషయం స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ 2016 సెప్టెంబర్ 30 తేదీనాడు జారీ చేసిన 1 (2)పి.ఎఫ్-1/2014 ఆఫీస్ మెమొరాండం ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులోని నీటిపారుదల కాంపోనెంట్‌కు సంబంధించిన మిగతా పూర్తి ఖర్చును భరిస్తుందని ఉమాభారతి వివరించారు. 2014 ఏప్రిల్‌లో వేసిన అంచనా ఆ తరువాత కాలంలో పెరిగితే ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించవలసి ఉంటుందని మంత్రి వివరించారు.