జాతీయ వార్తలు

వర్గీకరణ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: తెలుగు రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ ఆలోచన విరమించుకోవాలని కేంద్రానికి మాలమహానాడు విజ్ఞప్తి చేసింది. సోమవారం నాడు మాల మహానాడు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ కలసి విజ్ఞప్తి చేసింది. ఎస్సీ వర్గీరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని కేంద్రమంత్రిని కోరారు. ఇప్పటి వరకూ ఎస్సీల్లో ఏ ఏ ఉపకులాలు ఎంత అభివృద్ధి చెందాయో సమగ్ర సర్వే శాస్ర్తియంగా చేయడానికి ఒక కమిషన్ వేయాలని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకులంగా స్పందించినట్టు మాలమహానాడు నాయకులు తెలిపారు. అలాగే ఎంపీ ఉదిత్‌రాజ్‌ను కలిసి బిజెపి వర్గీకరణకు అనుకులంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలని మాల మహానాడు కోరింది. కేంద్ర మంత్రిని కలిసిన మాల మహానాడు నాయకుల్లో జి చెన్నయ్య, వై రాజ్‌కుమార్ ఉన్నారు.