జాతీయ వార్తలు

సిబిఐ, ఇడిలను ఉసిగొల్పుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సిబిఐ, ఇడిలను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్షసాధించపుచర్యలకు పాల్పడుతోందని విపక్ష పార్టీలు రాజ్యసభలో గందరగోళం సృష్టించాయి. బిజెపియేతర పార్టీల ముఖ్యమంత్రుల, మాజీ సిఎంలు, నాయకులపై సిబిఐ,ఇడిలను ప్రయోగిస్తున్నారని కాంగ్రెస్, ఇతర పార్టీల సభ్యులు రాజ్యసభ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశాయి. దీంతో రాజ్యసభ రెండు సార్లు వాయిదా పడింది. సోమవారం ఉదయం సభ ప్రారంభమైన తరువాత వివిధ మంత్రిత్వశాఖలకు సంబంధించిన పత్రాలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ సమర్పింపజేశారు. జీరోఅవర్‌లో కాంగ్రెస్ రాజ్యసభ ఉప నేత ఆనందశర్మ మాట్లాడుతూ తమ పార్టీ, విపక్ష నేతల సిబిఐ,ఇడిలను ఉపయోగించి చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. హర్యానా, మధ్యప్రదేశ్ రాష్టల్ల్రో కూడా భూ కేటాయింపులు జరుగుతున్నాయని, కేవలం కాంగ్రెస్ సిఎంలపైనే దాడులు చేయడం సరికాదన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో అవినితి జరుగుతున్న పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. దీనిపై నిబంధన 267 కింద నోటీసులు ఇవ్వడం జరిగిందని, సభలో చర్చ జరగాలని శర్మ డిమాండ్ చేశారు. అయితే కురియన్ తిరస్కరించడంతో కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్రభ్యుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఎన్ని నినాదాలు చేసినా నిబంధన 267 కింద చర్చకు అనుమతించేది లేదని డిప్యూటీ చైర్మన్ తేల్చిచెప్పారు. సభను 10 నిమిషాలు వాయిదా వేసి వెళ్లిపోయారు. తిరిగి ప్రారంభమైన తరువాత కాంగ్రెస్ సభ్యులు ఈ వ్యవహారంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. కురియన్ ససేమిరా అన్నారు. మళ్లీ అదే వరస. సభలో నినాదాలు మిన్నంటాయి. కాగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్న సమయంలో విపక్ష సభ్యులు నినాదాలు అందుకున్నారు. చేసేదిలేక సభను మళ్లీ వాయిదా వేశారు.