జాతీయ వార్తలు

‘ట్రిపుల్ తలాఖ్’ ముస్లిం మహిళల ఆత్మ గౌరవానికే భంగకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యాత్వంలాంటి ఆచారాలు ముస్లిం మహిళల సామాజిక హోదా, వారి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్నాయని, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను వారికి దక్కకుండా చేస్తున్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
ఈ ఆచారాలు ముస్లింలలో మహిళలను పురుషులతో సమానం కాకుండాను, అలాగే మిగతా మతాల్లోని మహిళలకన్నా కూడా తక్కువ వారిగాను చేస్తున్నాయన్న తన వాదనను కేంద్రం సుప్రీంకోర్టుకు తాజాగా సమర్పించిన లిఖితపూర్వక అఫిడవిట్‌లో పునరుద్ఘాటించింది. ఇలాంటి ఆచారాల కారణంగా రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ముస్లిం మహిళలు పూర్తిగా అనుభవించలేకపోతున్నారని కూడా కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.
ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాలా, బహుభార్యాత్వం లాంటి ఆచారాలు చాలా ముఖ్యమైన అంశాలని సుప్రీంకోర్టు గత మార్చి 30న వ్యాఖ్యానిస్తూ, వీటిని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం మే 11నుంచి విచారిస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఆచారాలన్నీ పితృస్వామ్య వ్యవస్థనుంచి పుట్టినవని, సమాజంలో మహిళల పాత్రపై అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న భావనలని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. అంతేకాదు, ఒక మహిళ మానవ గౌరవంతో, సామాజిక గౌరవంతో, ఆత్మగౌరవంతో జీవించడమనేవి రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద ఆమెకు లభించిన జీవించే హక్కుకు చెందిన ముఖ్యమైన కోణాలని కూడా కేంద్రం తన లిఖితపూర్వక అఫిడవిట్‌లో పేర్కొంది. అందువల్ల ఈ ఆచారాలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరుతూ, ఆరు దశబ్దాలకు పైగా ముస్లిం వివాహ చట్టంలో ఎలాంటి సంస్కరణలు జరగలేదని, నోటి మాటతో విడాకుల భయం కారణంగా దేశ జనాభాలో 8 శాతం ఉన్న ముస్లిం మహిళలు అభద్రతా భావానికి గురవుతున్నారని కూడా కేంద్రం ఆ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.