జాతీయ వార్తలు

నిబంధనల ప్రకారమే 1998 డిఎస్సీ ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: డిఎస్సీ 98 వివాదంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లను తోసిపుచ్చింది. నిబంధనల ప్రకారమే ఉద్యోగ నియామకాలలో వ్యవహరించామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఈ పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో 19ఏళ్లుగా వివిధ న్యాయస్థానాలలో కొనసాగుతున్న ఈ కేసును గురువారం సుప్రీంకోర్టు తెరదించినట్లు అయింది. 1998లో అప్పటి ప్రభుత్వం డిఎస్సీ నిర్వహించి 37 వేల పోస్టుల భర్తీలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆ డిఎస్సీలో 85 మార్కులకు రాత పరీక్ష నిర్వహించగా, 15 మార్కు లు ఇంటర్వ్యూలకు కేటాయించారు. తొలుత ఓసీలకు 50, బీసీలకు 45, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వారికి 40 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. కానీ పోస్టుల సంఖ్య కంటే అభ్యర్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో కనీస అర్హత మార్కులను 45, 40, 35కు కుదించారు. దీంతో వేలాది మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీన్ని సవాల్ చేస్తూ పాలనా ట్రిబ్యునల్, హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలో హైకోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ అభ్యర్థులు కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు గతంలో అభ్యర్థులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ 2013లో తీర్పును వెలువరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలిచ్చారా, పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన జాబితాలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆరుగురి అభ్యర్ధుల కన్నా తక్కువ మార్కులు వచ్చిన వారికి ఎవరికీ ఉద్యోగాలు రాలేదని ధర్మాసనానికి తెలంగాణ ప్రభుత్వం తెలింపింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తే మరో 600 వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారమే ఉద్యోగాల విషయంలో వ్యవహరించామని తెలంగాణ కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన ధర్మాసనం, ఆశ్రయించిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్లను తోసిపుచ్చింది.