జాతీయ వార్తలు

తలాఖ్‌పై న్యాయం జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, ఏప్రిల్ 16: సమాజంలో దురాచారాలు, చెడు సంప్రదాయాలపై పోరాడటానికి ప్రజలు చైతన్యవంతులు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ట్రిపుల్ తలాఖ్ అంశంపై ఆయన స్పందిస్తూ ‘‘మన ముస్లిం సోదరీమణులకు న్యాయం జరగాలి. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగటానికి వీల్లేదు. ఈ అంశంపై ముస్లిం సమాజంలో ఎలాంటి సంఘర్షణకు తావు ఇవ్వరాదు. ఇందుకోసం సమాజంలో ఉన్న దుష్టమైన ఆచారాలను తరిమేసేందుకు, వారికి(ముస్లిం మహిళలు)న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేయాలి.’’ అని మోదీ పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సభలో మోదీ మాట్లాడారు. పార్టీ వివిధ తీర్మానాలు ప్రవేశపెడుతున్న సందర్భంలో మోదీ జోక్యం చేసుకుని ట్రిపుల్ తలాఖ్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇతర వెనుక బడిన వర్గాల కమిషన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు తమ ప్రభుత్వం బిల్లు తీసుకువచ్చిందని ఆయన అన్నారు. ముస్లింలలోని కొన్ని వెనుకబడిన వర్గాలు ఓబిసి కోటాను అనుభవిస్తున్నాయని ఆయన వివరించారు. ముస్లింలకు చేరువై, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మోదీ పార్టీ నేతలకు సూచించారు. మోదీ ప్రసంగ వివరాలను కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో వివరించారు.
2022 నాటిని నవభారత నిర్మాణం
భారత దేశాన్ని సామాజిక, ఆర్థిక అభివృద్ధి దిశగా పరివర్తనం చెందించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మోదీ పిలుపునిచ్చారు. 2022 నాటిని నవ భారత నిర్మాణ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ‘ ఇదంత తేలిక కాదు. చరిత్ర సృష్టించటం అంత సులభం కాదు. ఇందుకోసం ఇప్పటికే చాలా చేశాం. కానీ అది
సరిపోదు. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. ’అని మోదీ అన్నారు. ప్రజలకు అనుకూలంగా, సుపరిపాలన దిశగా ప్రభుత్వం అన్న అజెండాతో బిజెపి, వివిధ రాష్ట్రాల్లోని ఆ పార్టీ ప్రభుత్వాలు ఈ అజెండాతోనే పని చేయాలన్నారు. యుపి సహా నాలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవిఎంల కచ్చితత్వంపై రేగిన వివాదాన్ని ఆయన నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. ఇవన్నీ ప్రతిపక్ష పార్టీల ఫ్యాక్టరీల్లో తయారవుతున్న ఉత్పత్తులంటూ ఎద్దేవే చేశారు. 2022నాటికి సుసంపన్న సంతోష భారతాన్ని చూడాలని, ఇందుకోసం ఒక మిషన్ పద్ధతిలో పనిచేయాలని ఆయన అన్నారు. ఇటీవలి అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి విజయానికి మూల కారకుడు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా అని ఆయన కొనియాడారు. అమిత్‌షాను బిజెపి చాణక్యుడిగా ఆయన అభివర్ణించారు. పార్టీని బలోపేతం చేయటంలో అమిత్‌షా తీవ్రంగా కష్టపడుతున్నారని, ఆయన నేతృత్వంలో పార్టీ మరిన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని ఆయన ఆకాంక్షించారు. మహాత్మాగాంధీ స్వాధీనతా నినాదం 20 ఏళ్ల పాటు ప్రజల్లో నానుడిలో మారి ఏ రకంగానైతే 1942లో క్విట్ ఇండియా ఉద్యమానికి దారితీసిందో, ఆదేవిధంగా 2022 సామాజిక ఆర్థిక పురోగతి ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారాలన్నారు. ‘‘జన్‌ధన్, వన్‌ధన్, జల్‌ధన్ అన్నది నా అజెండా. గిరిజనుల అభివృద్ధి కోసం అడవుల వృద్ధి, నీటి వనరుల అనే్వషణ, ప్రజలందరి సుసంపన్నత నా లక్ష్యం. నేను అధికారం చేపట్టే నాటికి రెవిన్యూ వసూళ్లు 13లక్షల కోట్లు. ఇప్పుడు 20లక్షల కోట్లకు చేరుకుంది. 2019నాటికి 26లక్షల కోట్లు చేరుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం’’ అని మోదీ తెలిపారు.

చిత్రం..ఆదివారం రాత్రి సూరత్‌లో జరిగిన ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ