జాతీయ వార్తలు

లింగరాజ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, ఏప్రిల్ 16: భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి భువనేశ్వర్ వచ్చిన ప్రదాని నరేంద్ర మోదీ ఆదివారం ఇక్కడి ప్రఖ్యాత లింగరాజ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రధాని ఆలయం వద్దకు చేరుకోగానే ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో జనం దగ్గర్లోని భవనాలపైకి చేరుకుని ఆయనకు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. వారిని చూసి ఆయన సైతం వారి వైపు చేతులూపారు. ఆలయం వద్ద బిజెపి సీనియర్ నాయకులు, పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య దాదాపు 25 నిమిషాలు ఆలయంలో గడిపిన ప్రధాని లింగరాజ్ స్వామికి జరిపిన ప్రత్యేక పూజలో నాగంగా పూలు, బిల్వపత్రాలు, పాలు, కొబ్బరి నీరు సమర్పించినట్లు ప్రధాని వెంట ఉండిన ఒక పూజారి చెప్పారు. పూజ అనంతరం ప్రధాని 11వ శతాబ్దానికి చెందిన ఆలయమంతా కలయ దిరిగి ఆలయ విశేషాలను, ప్రాశస్త్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. అనంతరం ఆయన భువనేశ్వరీ దేవిని, ఇతర దేవతామూర్తులను సందర్శించారు. సువిశాలమైన ఈ ఆలయంలో 150కి పైగా దేవతా విగ్రహాలున్నాయి. ఆలయంనుంచి బయలుదేరి వెళ్లే ముందు ప్రధాని వివిఐపి విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు. బయట వేచి ఉన్న జనం ప్రధానిని చూసిన ఆనందంతో ‘మోదీ...మోదీ’ అంటూ కేకలు వేయడంతో స్పందించిన మోదీ కొద్దిదూరం నడిచి వారివైపు చేతులు ఊపారు. అనంతరం ఆయన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న జనతా మైదాన్‌కు వెళ్లారు.

చిత్రం..లింగరాజ్ ఆలయాన్ని సందర్శించి వెలుపలకు వస్తూ జనానికి అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ