జాతీయ వార్తలు

‘తలాఖ్’కు ముకుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 16: తమ వైవాహిక చట్టాన్ని పాటించే రాజ్యాంగ హక్కు ముస్లింలకు ఉందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్‌బి) స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు విషయంలో బోర్డు సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తుందని బోర్డు ప్రధాన కార్యదర్శి వౌలానా వలీ రెహమాని స్పష్టం చేస్తూ, కోర్టు వెలుపల పరిష్కారం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. తలాఖ్ విషయంలో ఒక ప్రవర్తనా నియమావళిని జారీ చేయాలని బోర్డు నిర్ణయించిందని ఆయన చెప్తూ, షరియా (ఇస్లామిక్ చట్టం) ప్రకారం సరయిన కారణాలు లేకుండా తలాఖ్ (విడాకులు) ఇచ్చేవారు సాంఘిక బహిష్కారాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం నమాజ్ సందర్భంగా ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను చదివి వినిపించాలని, దాని అమలును నొక్కి చెప్పాలని కోరుతూ బోర్డు దేశవ్యాప్తంగా ఉండే మసీదుల వౌలానాలు, ఇమామ్‌లకు లేఖలు కూడా రాస్తోందని తెలిపారు. షరియత్ చట్టాల్లో ఎలాంటి జోక్యాన్ని సహించబోమని బోర్డు స్పష్టం చేస్తూ ముస్లిం పర్సనల్ లాలో మార్పులను దేశంలో మెజారిటీ ముస్లింలు కోరుకోవడం లేదని కూడా రెహమాని స్పష్టం చేశారు. ముస్లిం తమ సొంత మత ఆచారాలను పాటించడానికి భారత రాజ్యాంగం గ్యారంటీ ఇస్తోందని దేశవ్యాప్తంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇటీవల చేపట్టిన సంతకాల ఉద్యమంలో పురుషులతో పాటుగా మహిళలు కూడా అభిప్రాయ పడినట్లు రెహమాని ఇంతకు ముందు చెప్పారు. వివాహ చట్టాల అమలులో ఎలాంటి అడ్డంకులనూ సృష్టించవద్దని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

చిత్రం..కోడ్ ఆఫ్ కాండక్ట్ వివరాలను తెలుపుతున్న పర్సనల్ లా బోర్డు ప్రధాన కార్యదర్శి వౌలానా వలి రహ్మాని,
కార్యవర్గ సభ్యుడు జఫర్‌యాబ్ జిలాని