జాతీయ వార్తలు

ఇష్టమొచ్చినట్లు మాట్లాడే స్వేచ్ఛ ఎవరిచ్చారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: యమునా నది తీరం ధ్వంసం కావడానికి కేంద్ర ప్రభుత్వం, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) కారణమంటూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఎన్‌జిటి గురువారం మండిపడింది. యమునా నది తీరాన్ని ధ్వంసం చేసింది కాక, దానికి తనను కారణమంటూ రవిశంకర్ ఆరోపించడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘మీకు బాధ్యత గురించిన వివేకం లేదు. మీకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడే స్వేచ్ఛ ఎవరిచ్చారు? ఇది దిగ్భ్రాంతి కలిగిస్తోంది’ అని చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ఎన్‌జిటి ధర్మాసనం రవిశంకర్‌పై విరుచుకుపడింది. యమునా నది తీరంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాన్ని నిర్వహించడానికి తన స్వచ్ఛంద సంస్థకు కేంద్ర ప్రభుత్వం, ఎన్‌జిటిలు అనుమతించడాన్ని తప్పుపడుతూ రవిశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ మనోజ్ మిశ్రా తరపు న్యాయవాది సంజయ్ పారిఖ్ గురువారం తన దృష్టికి తీసుకు రావడంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఎన్‌జిటిపైనే ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లారని ఆయన గ్రీన్ ప్యానల్‌కు వివరించారు. రవిశంకర్ కేంద్రం, ఎన్‌జిటిలను నిందిస్తూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెబ్‌సైట్‌లో, అతని ఫేస్‌బుక్ పేజీలో ప్రకటనను పోస్ట్ చేయడంతో పాటు ఆ ప్రకటనలో ఉన్న అంశాన్ని మీడియాకు చెప్పారని పారిఖ్ ఎన్‌జిటికి తెలిపారు.
అయితే ఎఒఎల్ ఫౌండేషన్ తరపున వాదిస్తున్న న్యాయవాది నిపుణుల కమిటీ నిర్ధారించిన అంశాలతో విభేదించారు. కమిటీ తేల్చిన అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని, అందువల్ల ఆ కమిటీ నివేదికను తోసిపుచ్చాలని ఆయన ధర్మాసనానికి విన్నవించారు. అనంతరం ధర్మాసనం ఈ కేసులో రెండు వారాలలోగా సమాధానం ఇవ్వాలని, అభ్యంతరాలను తెలియజేయాలని ఫౌండేషన్‌ను, ఇతర కక్షిదారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను మే 9వ తేదీకి వాయిదా వేసింది. యమునా నది తీరంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు అనుమతించినందుకు రవిశంకర్ ఈ నెల 18న కేంద్రాన్ని, ఎన్‌జిటిని విమర్శించిన విషయం తెలిసిందే.