జాతీయ వార్తలు

తీర్పు రిజర్వ్ చేసిన ఎన్‌జీటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం పర్యావరణానికి అనుకూలంగా ఉందా, లేదా? అన్న అంశంపై తీర్పును జాతీయ హరిత ట్రిబ్యునల్ రిజర్వ్ చేసింది. ఏపీ నూతన రాజధాని నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఏన్జీటి)లో వాదనలు ముగిశాయి. దాదాపు 20 నెలలపాటు విచారణ సాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కూడన ధర్మాసనం గురువారం నాడు తీర్పును రిజర్వ్ చేసింది. అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ శ్రీమన్నారాయణ, బొలిశెట్టి సత్య, కమలాకర్, మాజీ ఐఎఎస్ అధికారి ఇఏఏస్ శర్మ ఏన్జీటీలో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.