జాతీయ వార్తలు

స్కూళ్లా.. వ్యాపార సంస్థలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20:వ్యాపార సంస్థలుగా కాకుండా విద్యా సంస్థలుగా వ్యవహరించాలని తన అనుబంధ పాఠశాలలకు సిబిఎస్‌ఇ చురక వేసింది. స్కూళ్లలోనే లేదా ఎంపిక చేసిన కొన్ని దుకాణాల్లో పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ విక్రయాన్ని తప్పుబట్టింది. ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సిబిఎస్‌ఇ తీవ్రంగా స్పందించింది. అనుబంధ స్కూళ్లకు సంబంధించిన బై లాలను త్రికరణ శుద్ధిగా అనుసరించాలని, దానికి విరుద్ధంగా స్కూళ్లు, ఎంపిక చేసిన దుకాణాల్లో పుస్తకాలు, స్టేషనరీ విక్రయాన్ని కట్టిపెట్టాలని గట్టిగా కోరింది. అలాగే ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాలనే వినియోగించాలనీ స్పష్టం చేసింది. ఎన్‌సిఇఆర్‌టి/సిబిఎస్‌ఇ పుస్తకాలను కాకుండా ఇతర ప్రచురణలనే కొనాలని తమపై వత్తిడి వస్తున్న విషయాన్ని పిల్లల తల్లి దండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొనడంతో సిబిఎస్‌ఇ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సిబిఎస్‌ఇ బైలాల ప్రకారం అనుబంధ స్కూళ్లు కమ్యూనిటీ సర్వీసుగానే నడవాల్సి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు ప్రాంగణాల్లో వ్యాపారపరమైన విక్రయాలేవీ ఉండకూడదని స్పష్టం చేసింది. నాణ్యతాయుతమైన విద్యా బోధనే స్కూళ్ల లక్ష్యం కావాలే తప్ప వ్యాపార సంస్థల్లాగ లాభాలు ఆర్జించడం కాదని తెలిపింది. తాము జారీ చేసిన మార్గదర్శకాలు కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్కూళ్ల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేసింది.