జాతీయ వార్తలు

సర్వీస్ చార్జీలు తప్పనిసరి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీసు చార్జీలు తప్పనిసరి కాదని కేంద్ర ఆహార, వినియోగ దారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ శుక్రవారం స్పష్టం చేశారు. కస్టమర్లు స్వచ్ఛందంగా ఇస్తేనే ఈ చార్జీలను తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ మేరకు సర్వీస్ చార్జీలపై నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందించి ఆమోదించినట్లు ఆయన చెప్పారు. కస్టమర్లకు సేవ చేసినందుకు ఎంత చార్జీ వసూలు చేయాలో హోటళ్లు, రెస్టారెంట్లు నిర్ణయించడం సరికాదని, అది వినియోగదారుడి విచక్షణకే వదిలేయాలని పాశ్వాన్ చెప్పారు. తమవైపునుంచి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఈ గైడ్‌లైన్స్‌ను రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు మంత్రి తెలిపారు.