జాతీయ వార్తలు

ప్రార్థనా స్థలాలకు పరిహారంపై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: గుజరాత్‌లో 2002లో జరిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షించడంలో విఫలమైన కారణంగా ధ్వంసమైన ప్రార్థనా స్థలాలను పునరుద్ధరించడానికి నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించవచ్చా అనే అంశంపై ఒక ఉత్తర్వు జారీ చేస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, పిసి పంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయంపై తీర్పును వాయిదా వేస్తూ, దీనిపై లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని కక్షిదారులను ఆదేశించింది. అయితే ఈ వాదనలు మతపరమైనవిగా ఉండకూడదని కూడా బెంచ్ స్పష్టం చేసింది. గుజరాత్ ప్రభుత్వం సమర్పించిన లిఖితపూర్వక వాదనను పరిగణనలోకి తీసుకున్న బెంచ్ మే 1 నాటికల్లా తమ వాదనలను సమర్పించాలని ప్రతివాది అయిన ఇస్లామిక్ రిలీఫ్ కమిటీ ఆఫ్ గుజరాత్ అనే స్వచ్ఛంద సంస్థ తరఫు న్యాయవాదిని ఆదేశించింది. గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన అల్లర్ల సందర్భంగా దెబ్బతిన్న 500కు పైగా ప్రార్థనా మందిరాలకు నష్టపరిహారం చెల్లించాలంటూ 2012లో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచ్ విచారిస్తోంది. హైకోర్టు ఆదేశించినట్లుగా నష్టపరిహారం చెల్లించడం చట్టప్రకారం సాధ్యం కాదు గనుక ఈ ఉత్తర్వులను కొట్టివేయాలని గుజరాత్ ప్రభుత్వం కోరగా, దెబ్బతిన్న వాటికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్వచ్ఛంద సంస్థ వాదించింది. హైకోర్టు ఉత్తర్వులపై యథాతథ స్థితిని కొనసాగించాలని 2013 ఆగస్టు 27న ఆదేశించిన సుప్రీంకోర్టు, ఈ అంశంలో ఇమిడి ఉన్న న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తానని తెలిపింది.