జాతీయ వార్తలు

తమిళ రైతులకు సిపిఐ సంఘీభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశ రాజధానిలో నెల రోజులకు పైగా నిరసన తెలుపుతున్న తమిళ రైతులకు సిపిఐ సంఘీభావం తెలిపింది. కరవు ఇబ్బందులు ఏదుర్కొంటున్న తమను ఆదుకోవాలంటూ జంతర్ మంతర్‌లో వివిధ రకాల పద్ధతుల్లో రైతులు నిరసన తెలుపుతూనే వున్నారు. శుక్రవారం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ ఇతర పార్టీల నేతలు తమిళ రైతులను కలిశారు. అనంతరం సురవరం మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా తీవ్ర కరవుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమిళ రైతులను కేంద్రం అదుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయ బద్ధమైన సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు. సిపిఐ సీనియర్ నేత నారాయణ మాట్లాడుతూ తమిళ రైతులకు రుణ మాఫీపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.