జాతీయ వార్తలు

వచ్చే నెలలో 2 ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఏప్రిల్ 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే నెలలో మరో రెండు ప్రయోగాలకు సన్నద్ధమవుతోంది. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్ర సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం ఇందుకు వేదికకానుంది. జిఎస్‌ఎల్‌వి-ఎప్ 09, పిఎస్‌ఎల్‌వి-సి 38 ప్రయోగాలకు సంబంధించిన పనులు షార్ వేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్, షార్ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్ శాస్తవ్రేత్తలతో కలసి రాకెట్ ప్రయోగ వేదికలతో పాటు జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 రాకెట్ అనుసంధాన పనులను పర్యవేక్షించారు. శ్రీహరికోట నుండి వచ్చే నెల 5న జి ఎస్ ఎల్‌వి- ఎప్ 09 రాకెట్ ప్రయోగం జరగనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై ఇప్పటికే మూడు దశల రాకెట్ అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఈ రాకెట్ ద్వారా కమ్యూనికేషన్ రంగానికి చెందిన జీశాట్-9 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఉపగ్రహ క్లీన్ రూమ్ తుది పరీక్షలు నిర్వహించి సర్వం సిద్ధం చేశారు. 25న మంగళవారం రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చి ప్రయోగానికి సద్ధం చేస్తారు. అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే మే 5న సాయంత్రం 4:57గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి రాకెట్ నింగిలోకి ఎగరనుంది. అదే నెలాఖరులో మొదటి ప్రయోగ వేదిక నుండి పి ఎస్ ఎల్‌వి-సి 38 ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా ఒకేసారి 37 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో తుది నిర్ణయం తీసుకుంది.