జాతీయ వార్తలు

విలీనం దిశగా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 21: తమిళనాడులోని అధికార అన్నాడిఎంకె వైరి వర్గాల మధ్య విలీనానికి శుక్రవారం నాడు పరిణామాలు నేపథ్యంలో కొంతమేర మార్గం సుగమం అయింది. శశికళ, దినకరన్‌లను బహిష్కరిస్తేతప్ప విలీనానికి ఆస్కారం లేదని తేల్చిచెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం పట్టు సడలించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి సారథ్యంలోని అన్నాడిఎంకె బృందం విలీన చర్చలు జరిపేందుకు తాజాగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దానికి సానుకూలంగా స్పందించిన పన్నీర్ సెల్వం తాను కూడా త్వరలోనే ఓ కమిటీని వేస్తామని ప్రకటించారు. పళనిస్వామి ప్యానల్‌కు రాజ్యసభ సభ్యుడు ఆర్ వైద్యలింగం సారధ్యం వహిస్తారు. ఇందులో కొందరు మంత్రులు కూడా సభ్యులుగా ఉంటారు. పార్టీ ప్రయోజనాలను, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తాము కూడా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని సెల్వం సన్నిహితుడు మునిస్వామి విలేఖరులకు తెలిపారు.
తెరపై తాజా వీడియో!
అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత మృతిపై సిబిఐ విచారణ జరిపించాలన్న డిమాండ్ అలా ఉండగానే శశికళ మేనల్లుడు జయానంద్ దివాకరన్ సంచలన ప్రకటన చేశారు. అమ్మ జయలలిత, చిన్నమ్మ శశికళ కలిసి ఉన్నప్పటి వీడియో క్లిప్పింగ్ బయటపెడతానని ఆయన వెల్లడించారు. తాను వీడియో బయటపడితే అనేక నిజాలు వెలుగుచూస్తాయని తెలిపారు. అయితే కాసేపటికే ఫేస్‌బుక్ నుంచి తన వ్యాఖ్యలను దివాకరన్ తొలగించడం గమనార్హం. అమ్మ, చిన్నమ్మ మధ్య ఉన్న సంబంధం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రిలో జయ, శశికళ కలిసి ఉన్న వీడియో క్లిప్పింగ్స్ తన వద్ద ఉన్నాయని దివాకరన్ ‘చివరి వరకూ ఓ సింహంలా బతికిన జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి అభిమానులకు బాధపెట్టడం ఇష్టంలేక ఆసుపత్రిలో ఫొటోలు విడుదల చేయలేదు’ అని శశి మేనల్లుడు చెప్పాడు. శశికళను హంతకురాలిగా నిందించినా కూడా సంయమనం పాటించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఏదోనాడు జయ, శశికళకు సంబంధించిన వీడియో బయటకు వస్తుందని, అప్పుడు పిహెచ్ పాండియన్, మనోజ్ కె పాండ్యన్ కళ్లుతెరుస్తారని దివాకరన్ వ్యాఖ్యానించారు. కాగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అమ్మ శవపేటికతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

చిత్రాలు.. పన్నీర్ సెల్వం * పళనిస్వామి