జాతీయ వార్తలు

పాన్‌కు ఆధార్ ఎందుకు తప్పనిసరి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) కార్డు పొందడానికి ఆధార్‌ను ఎందుకు తప్పనిసరి చేశారంటూ సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొంతమంది తప్పుడు పత్రాల ఆధారంగా తీసుకున్న పాన్ కార్డు వివరాలను సమర్పిస్తున్నట్టు తేలిందని కేంద్రం తరపున వాదిస్తున్న అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి న్యాయమూర్తి ఎకె సిక్రి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనానికి చెప్పారు. ఒకే వ్యక్తి అనేక పాన్ కార్డులు కలిగి ఉండటం, షెల్ కంపనీలకు నిధులను తరలించడానికి ఈ నకిలీ పాన్ కార్డులను ఉపయోగించడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆయ న ధర్మాసనానికి వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ‘పాన్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడం ఇలాంటి వాటిని నివారిస్తుందా? ఎందుకు తప్పనిసరి చేశారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, గతంలోనూ కొంతమంది నకిలీ ఐడెంటిటి కార్డులను ఉపయోగించి తమ మొబైల్ ఫోన్లలోకి సిమ్ కార్డులను తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చిందని, అలాంటి వాటిని నియంత్రించాలని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించిందని రోహత్గి బదులిచ్చారు. అనంతరం ప్రభుత్వం ప్రజలు పాన్ కార్డు పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్‌పై వాదనలను ఏప్రిల్ 25న వింటానని ధర్మాసనం తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఫైనాన్స్ బిల్లులో పన్ను ప్రతిపాదనలను సవరిస్తూ, ప్రభుత్వం ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయడానికి, పాన్ కార్డు పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేసింది.