జాతీయ వార్తలు

మారేందుకు సిద్ధమా? కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: మారేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఐఎఎస్ అధికారులను నిలదీశారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడ మోదీ ఐఎఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మార్పు తీసుకువచ్చేందుకు అవసరమైన రాజకీయ సంకల్పం తనకు ఉందని, అయినా మీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఐఎఎస్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు తమ పద్ధతిని మార్చుకోవాలని, అహంకారానికి స్వ స్తి పలకాలని, నియంత్రకుల (రెగ్యులేటర్స్) నుంచి ప్రజలకు తోడ్పడే వ్యవస్థ (ఎనేబ్లింగ్ ఎంటిటీ) గా మారి ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని ప్రధాని హితవు పలికారు. ప్రజలు తమ అవసరాల కోసం ప్రభుత్వంపై ఆధారపడే రోజులకు కాలం చెల్లిందని, శ్రేష్ఠతను కోరుకుంటున్న ప్రజలు శ్రేష్ఠత లేకపోతే తిరస్కరిస్తున్నారని, కనుక అధికారులు కూడా శ్రేష్ఠతపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. ‘గతంలో ప్రభుత్వమే అన్ని పనులు చేసేది, ఆసుపత్రుల నుండి పరిశ్రమల స్థాపన వరకు అన్ని పనులను ప్రభుత్వమే చేయవలసి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత పదిహేను సంవత్సరాల్లో పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి. పోటీ తత్వం సమాజాన్ని బాగా మార్చివేసింది’ అని ప్రధాని పేర్కొన్నారు. ప్రజలకు ప్రయోజనం కలిగించేందుకు సామాజిక మాధ్యమాలను బాగా ఉపయోగించుకోవాలని, వీటి ద్వారా ప్రజలను చేరుకోవాలని, పథకాలను కేవలం అమలు కోసం అమలు చేయకుండా ఫలితాలను రాబట్టాలని ఆయన ఐఎఎస్ అధికారులకు సూచించారు. ఫలితాల కోసం అమలు కాని పథకాలు వ్యర్థమని ఆయన స్పష్టం చేశారు.
వివిధ పథకాలకు సంబంధించిన అనుమతులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం పట్ల మోదీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఇందుకు కారణం ఏమిటని అధికారులను నిలదీశారు. గత 20 ఏళ్ల నుంచి అమలుకు నోచుకోని ఎన్నో పథకాలకు కేవలం 24 గంటల్లో అనుమతులు మంజూరు చేశామని, ఈ ప్రక్రియ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఇది మీకు కూడా పాఠం కావాలని ఆయన అధికారులతో చెప్పారు. ప్రభుత్వ శాఖలు ఒకదానిపై మరొకటి కేసులు పెట్టుకోవటం వలన న్యాయ వ్యవస్థపై పని భారం పెరిగి తీర్పుల్లో జాప్యమవుతుండటంతో పాటు వనరుల వృథా పెరుగుతోందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఒక ప్రభుత్వంలో రెండు అభిప్రాయాలు ఎలా ఉంటాయి?, ఎందుకు ఉన్నాయి?, అహంకారమే ఇందుకు కారణమా? అని మోదీ ప్రశ్నిస్తూ, దీనిపై మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు.
లేనిది సాధించినట్లు చూపేందుకు అంకెల గారడీ చేయడం గురించి ప్రస్తావిస్తూ, దీని వలన ఏమైనా సాధించగలుగుతున్నామా? అని ఐఎఎస్‌లను నిలదీశారు. ఫలితాల సాధన కోసం పరిపాలన ఉండాలని, అధికారులు కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని దిశానిర్ధేశం చేస్తూ, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారకపోతే సమాజానికి మన అవసరం ఉండదని మోదీ హెచ్చరించారు. ‘మీ పునాదుల గురించి ఆలోచించండి, ఎంత చేశామనేది కాకుండా ఎంత సాధించామనే దానిపై దృష్టి పెట్టండి. శిక్షణ కోసం ఐఎఎస్ అకాడమీకి వెళ్లే సమయంలో మీరు కన్న కలలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి’ అంటూ మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలులో లక్ష్యాలను సాధించిన అధికారులకు ఆయన అవార్డులను బహూకరించారు.

చిత్రం..ఐఎఎస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ