జాతీయ వార్తలు

రోజుకో తూటా పేలుస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తనపై ప్రతిరోజూ ఒక తూటా పేలుస్తున్నారంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మండిపడ్డారు. గత ఏడాది డిసెంబర్ 31న బైజాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన తర్వాత కేజ్రివాల్ ఆయనపై నేరుగా ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధికి సంబంధించిన అనేక విషయాల్లో తమ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రంతో సమన్వయంతో పనిచేయడానికి ప్రయత్నిస్తోందని, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు ముందు తనపై లెఫ్టెనెంట్ గవర్నర్ దాడి మరింత తీవ్రమైందని చెప్పారు. ‘్ఢల్లీ మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆయనపై మేము ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ ఆయన ప్రతి రోజూ ఒక తూటా నాపై పేలుస్తూనే ఉన్నారు. ఇంత జరిగినా సరే మేము ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. మా తప్పేమిటో చెప్పండి’ అని కేజ్రివాల్ శుక్రవారం పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రకటనలపై ఆప్ ప్రభుత్వం ఖర్చు చేసిన 97 కోట్ల రూపాయలను పార్టీనుంచి రికవరీ చేయాలని, అలాగే నగరంలో ఆ పార్టీ కార్యాలయాన్ని మూసేయాలని బైజాల్ ఆదేశించిన నేపథ్యంలో కేజ్రివాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బైజాల్‌కు ముందు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉండిన నజీబ్ జంగ్‌కు, కేజ్రివాల్‌కు మధ్య కూడా నిత్యం ఏదో ఒక విషయంపై గొడవ కొనసాగిన విషయం తెలిసిందే. కాగా, షుగ్లు కమిటీ నివేదిక రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో నివేదిక ఇచ్చిన ఈ కమిటీ ఆప్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా, బిజెపి అప్రజాస్వామికమైన, రాజ్యాంగ వ్యతిరేకమైన పార్టీ అని కేజ్రివాల్ ఆరోపిస్తూ, ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రభుత్వాన్ని కూల్చడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఆ పార్టీలను చీల్చడం, వాటికి వ్యతిరేకంగా లెఫ్టెనెంట్ గవర్నర్‌ను వాడుకోవడం.. ఇవే ఆ పార్టీ లక్ష్యాలని దుయ్యబట్టారు.