జాతీయ వార్తలు

అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో ప్రభుత్వ జోక్యం ఉండరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలో లభించే అంతర్జాతీయ మధ్యవర్తిత్వంపట్ల వ్యాపార వర్గాల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు మధ్యవర్తిత్వ ప్రక్రియకు ప్రభుత్వం దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేయర్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం దేశంలో అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వానికి ఊపునిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో ప్రభుత్వం లేదా దాని ఏజన్సీల జోక్యం లేకుండా చూసేందుకు భారత ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యూహకర్తల్లో కృషి జరుగుతోంది. అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వంలో ప్రభుత్వ జోక్యం పూర్తిగా లేనప్పుడు ఈ ప్రక్రియ తటస్థమైనదని దేశంలోని విదేశీ వాణిజ్య వేత్తలు అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది’ అని శనివారం ఇక్కడ రెండు రోజులపాటు జరిగే ‘ఎంగేజింగ్ ఏసియన్ ఆర్బిట్రేషన్ సమ్మిట్’ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ ఖేహర్ అన్నారు. అంతేకాక అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వంలో పాల్గొనేవారిలో విశ్వాసాన్ని కల్పించడానికి సైతం ఈ చర్యలు తోడ్పడుతాయని ఆయన అన్నారు. దేశంలో మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రోత్సహించడానికి ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ చేస్తున్న కృషిని ఖేహర్ ప్రశంసిస్తూ, తటస్థ దేశంనుంచి మధ్యవర్తులను నియమించే విధానాన్ని సుప్రీంకోర్టు దీర్ఘకాలంగా అనుసరిస్తోందని చెప్పారు.
కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ సైతం ఖేహర్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, మధ్యవర్తిత్వం విషయంలో దేశం వేగంగానే ముందుకు సాగుతున్నప్పటికీ దీనికి అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లు దానికి లేవని అన్నారు. ‘గ్లోబల్ డైలాగ్ రివ్యూ’ సంస్థ ఏర్పాటు చేసిన ఈ సెమినార్‌లో విదేశాంగ శాఖలో పశ్చిమ వ్యవహారాల కార్యదర్శి రుచి ఘనశ్యామ్, ఐక్యరాజ్య సమితి మాజీ అధ్యక్షుడు, బహ్రెయిన్‌కు చెందిన షైఖా హయా రషీద్ అల్ ఖలీఫా తదితరులు పాల్గొన్నారు.