జాతీయ వార్తలు

నాలుగు వారాల్లో.. కొత్త మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: తెంలగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో న్యాయాధికారుల నియామకానికి కొత్త మార్గదర్శక సూత్రాలను తయారు చేయాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు చలమేశ్వర్, అబ్దుల్ నజీర్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం ఈ ఆదేశాన్ని జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టు ఇది వరకు తయారు చేసిన మార్గదర్శకాలను ముసాయిదా మార్గదర్శకాలుగా చిత్రీకిస్తూ పక్కన పెట్టిన సుప్రీం కోర్టు కొత్త మార్గదర్శకాల తయారీకి కేంద్ర ప్రభుత్వానికి గడువులోగా తమ సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుత హైకోర్టు పరిధిలో ఉన్న న్యాయాధికారులను ఆదేశించింది. తెలంగాణ న్యాయమూర్తుల సంఘంతో సంబంధం ఉన్న న్యాయమూర్తులు, పదాదికారులు సూచనలు, సలహాలు ఇవ్వకూడదని బెంచి స్పష్టం చేసింది. వీరిచ్చే సూచనలు, సలహాల ఆధారంగా కేంద్రం కొత్త మార్గదర్శక సూత్రాలను తయారు చేసి సుప్రీం కోర్టుకు నివేదించాలి. ఈ మార్గదర్శక సూత్రాలను అధ్యయనం చేసిన అనంతరం తమ సుప్రీం కోర్టు తీర్పు ఇస్తుందని ధర్మాసనం ప్రకటించింది. వాద, ప్రతివాదుల మధ్య తీవ్రమవుతున్న వివాదాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు మూడు అంశాలను ముందుగా నిర్ధారించాలని కోరింది.
1. అప్పాయింటెడ్ తేదీ నాటికి తమ, తమ రాష్ట్రాల్లో నెలకొన్న న్యాయాధికారుల అవసరాన్ని రెండు రాష్ట్రాలు అధ్యయనం చేయాలి. ప్రస్తుత హైకోర్టుతో సంప్రదింపులు జరపటం ద్వారా రెండు రాష్ట్రాలలోని క్యాడెర్ అవసర పరిమాణాన్ని నిర్ణయించేందుకు అవసరమైన నియమ,నిబంధనలను తయారు చేయాలి.
2. రెండు రాష్ట్రాలలోని న్యాయాధికారులు ఈ ప్రక్రియను నాలుగు వారాలలోగా పూర్తి చేయాలి.
3. రెండు రాష్ట్రాల న్యాయధికారుల క్యాడర్ స్ట్రెంత్‌ను నిర్దారించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమాల ప్రకారం న్యాయ వ్యవస్థలోని వివిధ క్యాడర్లకు న్యాయాధికారులను కేటాయించే ప్రక్రియను కొన్ని మార్గదర్శక సూత్రాల ఆధారంగా చేపట్టవలసి ఉంటుంది.
న్యాయాధికారులను కేటాయించేందుకు ప్రస్తుత హైకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలను తయారు చేసింది. హైకోర్టు తయారు చేసిన ఈ మార్గదర్శక సూత్రాలకు తెలంగాణ న్యాయయమూర్తుల సంఘం, తెలంగాణా ప్రభుత్వం కొన్ని మార్పులు, చేర్పులు ప్రతిపాదించింది. తద్వారా హైకోర్టు రూపొందించిన మార్గదర్శక సూత్రాలను తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, తెలంగాణ ప్రభుత్వం ఆమోదించటం లేదు. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు రూపొందించిన మార్గదర్శక సూత్రాలను పూర్తిగా తిరస్కరించలేదు కానీ కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచిస్తున్నారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. అయితే హైకోర్టు రూపొందించిన మార్గదర్శక సూత్రాలను తాము పూర్తిగా ఆమోదిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ తరపు న్యాయవాది వి.వి.ఎస్.రావు తెలిపారని కోర్టు తమ ఆదేశంలో పేర్కొన్నది. న్యాయాధికారుల కేటాయింపుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను సుప్రీం కోర్టు నిర్దారించే పక్షంలో తాము లేవనెత్తిన న్యాయ సంబంధ అంశాల పరిష్కారానికి పట్టుపట్టటం జరగదని వాదులు, ప్రతివాదుల తరపున హాజరైన న్యాయ వాదులందరు అంగీకరించారు, అయితే చట్టపరంగా చూస్తే మార్గదర్శక సూత్రాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ కౌన్సిల్ హరిన్ పి రావల్, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం సీనియర్ కౌన్సిల్ ఇందిరా జైసింగ్ అభిప్రాయపడ్డారని సుప్రీం బెంచి తెలిపింది. ఈ సూచనలు, సలహాల మేరకే తాము ఈ ఆదేశాలను జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
హైకోర్టు రూపొందించిన మారదర్శక సూత్రాలను రెండు రాష్ట్రాలలోని వివిధ క్యాడర్లకు న్యాయాధికారులను నియమించేందు కోసం డ్రాఫ్ట్ మార్గదర్శకాలుగా భావించాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తమకు అందే సూచనలు, సలహాలు, వినతిపత్రాలను అధ్యయనం చేసిన అనంతరం హైకోర్టుతో సంప్రదింపులు జరిపి కొత్త ముసాయిదా మార్గదర్శక సూత్రాలను తయారు చేయాలి. హైకోర్టుతో సంప్రదించిన అనంతరం కేంద్రం తయారు చేసే కొత్త ముసాయిదా మర్గదర్శక సూత్రాలను తదుపరి విచారణ జరిగే జూలై 11 తేదీలోగా సుప్రీం కోర్టుకు అందజేయవలసి ఉంటుంది.
హైకోర్టు ఇది వరకే ఎంపిక చేసి కేటాయించిన 131 జూనియర్ డివిజన్ సివిల్ న్యాయమూర్తులను కేటాయింపుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను కూడా తయారు చేయాలని సుప్రీం కోర్టు తమ ఆదేశంలో పేర్కొన్నది. సుప్రీం కోర్టు ఆమోదించనున్న మార్గదర్శక సూత్రాలను తయారు చేసే సమయంలో హైకోర్టు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోర్టు తెలిపింది. న్యాయాధికారుల సేవల స్థితిగతులకు సంబంధించిన నియమ,నిబంధనలను తయారు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వానికి సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది.