జాతీయ వార్తలు

బిజెపికే ఓటేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, ఏప్రిల్ 27: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్‌ప్రదేశ్ ప్రజలను కోరారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఈ వారమే జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసిడి) ఎన్నికల్లో బిజెపి సాధించిన ఘనవిజయాన్ని దృష్టిలో పెట్టుకొని.. గురువారం ఇక్కడ బిజెపి నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీల నుంచి మార్పును కోరుతున్న తాజా గాలులు హిమాచల్‌ప్రదేశ్‌లోకి వీస్తున్నాయని అన్నారు. ‘నీతివంతమైన శకంకోసం హిమాచల్‌ప్రదేశ్ వేచిచూస్తోంది. గతంలో హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు కురిసిన తరువాత (ఆ చలి ఇతర రాష్ట్రాలకు విస్తరించేది కాబట్టి) మనం ధరించడానికి వులెన్ బట్టలను బయటకు తీసేవాళ్లం. కాని, ఇప్పుడు కాలం మారింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల నుంచి వీచిన గాలులు, ఢిల్లీనుంచి వీచిన తాజా గాలులు హిమాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించాయి’ అని మోదీ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌పై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయవాదులతో చాలా సమయం గడిపే ముఖ్యమంత్రిని తాను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. వీరభద్ర సింగ్ ఎదుర్కొంటున్న అవినీతి కేసులను ప్రస్తావిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపికి ఓటు వేసి, తనతోపాటు నీతివంతమైన పథంలో నడవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలు అవినీతి పాలనను వదిలించుకొని, సమగ్ర అభివృద్ధిని సాధించడానికి ఇదే తగిన సమయమని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని దోచుకున్న వారిని తాను వదలిపెట్టబోనని ప్రధానమంత్రి అన్నారు. ‘ప్రజలు నిజాయితీపరులతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఎన్నికల్లో వారు మాతో నిలుస్తున్నారు’ అని మోదీ అన్నారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే సంవత్సరం జనవరి 7తో ముగుస్తోంది. అందువల్ల రాష్ట్రంలో ఈ సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

చిత్రం..సిమ్లాలో గురువారం బిజెపి నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో
ప్రధాని నరేంద్ర మోదీకి జ్ఞాపికను అందజేస్తున్న హిమాచల్ రాష్ట్ర నేతలు