జాతీయ వార్తలు

సొంత డబ్బుతో కొన్నాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: హర్యానాలో అమీర్‌పూర్ గ్రామంలో 3.53 ఎకరాల భూమిని నా స్వంత డబ్బుతో కొనుగోలు చేశాను, ఈ భూమి కొనుగోలుకు తన భర్త రాబర్ట్ వాద్రా ఆర్థిక వ్యవహారాలు, స్కై లైట్ హాస్పిటాలిటీ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. తన నాయినమ్మ ఇందిరా గాంధీ ద్వారా సంక్రమించిన ఆస్తిపై వచ్చిన అద్దెల ఆదాయంతో ఈ భూమిని కొనుగోలు చేశానని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ శుక్రవారం ఒక పత్రికకు పంపించిన ఈ-మేయిల్‌లో వివరించారు. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా హర్యానాలో 2008 సంవత్సరంలో చేసిన భూమి కొనుగోళ్ల కుంభకోణంపై న్యాయమూర్తి డింగ్రా దర్యాప్తు సంఘం ఇచ్చిన నివేదికలో తన భూమికి సంబంధించిన ప్రస్తావన ఉన్నట్లు వచ్చిన వార్తలకు ప్రియాంకా గాంధీ స్పందించారు. రాబర్ట్ వాద్రా ఆర్థిక వ్యవహారాలు, ఆయన నడిపిస్తున్న స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు తాను కొనుగోలు చేసిన భూమికి ఎలాంటి సంబంధం లేదని ఆమె ప్రకటించారు. స్కై లైట్ సంస్థ హర్యానాలో భూములు కొనుగోలు చేయకముందే తాను ఈ భూమిని కొనుగోలు చేసి ఆ తరువాత పారదర్శక పద్ధతిలో విక్రయించినట్లు ఆమె వివరించారు. పత్రికలు ఆరోపిస్తున్నట్లు తాను ఎలాంటి భూమి కుంభకోణంలో లేను, హర్యానా ప్రభుత్వం 2008లో తాను కొనుగోలు చేసిన భూమికి అనుమతి ఇచ్చిందంటూ వచ్చిన వార్తలను కూడా ప్రియాంకా గాంధీ ఖండించారు. పత్రికలు ఆరోపిస్తున్నటువంటి భూమి కుంభకోణమేదీ జరగలేదు, ఈ కుంభకోణానికి సంబంధించిన భూమికి హర్యానా ప్రభుత్వం 2008లో అనుమతి ఇచ్చిందనటం కూడా నిజం కాదని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. స్కైలైట్ సంస్థ 3.53 ఎకరాల భూమిని డి.ఎల్.ఎఫ్ సంస్థకు 2012లో విక్రయించింది, ఈ భూమి విక్రయానికి హర్యానా ప్రభుత్వం అనుమతి మంజూరు చేయవలసిన అవసరం లేదని ఆమె వివరించారు. స్కై లైట్ సంస్థ 3.53 ఎకరాల భూమిని ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ సంస్థ నుండి కొనుగోలు చేసింది, ఆ తరువాత దీనిని డి.ఎల్.ఎఫ్ సంస్థకు పారదర్శక పద్ధతిలో విక్రయించిందని ప్రియాంకా గాంధీ చెప్పారు. ప్రియాంకా గాంధీ హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా, ఆమీర్‌పూర్ గ్రామంలో 2006 సంవత్సరంలో ఐదు ఎకరాల భూమిని పదిహేను లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఆమె నాలుగు సంవత్సరాల తరువాత ఈ భూమిని పాత యజమానికే ఎకరానికి పదహారు లక్షల చొప్పున మొత్తం ఎనభై లక్షలకు విక్రయించారు. ఇదిలా ఉంటే రాబర్ట్ వాద్రా 2008లో హర్యానాలో చేసిన ఒక భూమి కొనుగోలు వ్యవహారంలో యాభై కోట్లు సంపాదించారని హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన న్యాయమూర్తి డింగ్రా దర్యాప్తు కమిటీ తమ నివేదికలో సూచించినట్లు వార్తలు వచ్చాయి. రాబర్ట్ వాద్రా ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా యాభై కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారన్నది ఆరోపణ.