జాతీయ వార్తలు

‘ఉగ్ర’దేశాల పనిపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: తమప్రాంతాల్లోని ఉగ్రవాదుల అడ్డాలకు ఆశ్రయం కల్పించి పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనాస్టాసియాడెస్‌లు శుక్రవారం గట్టిగా కోరారు.
ఇరువురు నేతలు ఈ రోజు ద్వైపాక్షిక, ప్రాంతీ య అంశాలతో పాటుగా ఇరు దేశాలకు ఆందోళన కలిగిస్తున్న అంతర్జాతీయ సమస్యలపై విస్తృత చర్చలు జరిపారు. వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి ఉన్న మార్గాలు, అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలు లాంటివి వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరుపక్షాలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వాటిలో ఒకటి విమాన సర్వీసులకు సంబంధించిది కాగా, మరోటి వాణిజ్య నౌకాయానంలో సహకారానికి సంబంధించినది. అనంతరం సైప్రస్ అధ్యక్షుడితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రధాని భారత దేశం ఎప్పుడు కూడా కీలక అంశాల్లో సైప్రస్‌కు అండగా నిలిచిందని, దాని సార్వభౌమాధికారానికి, ఐక్యత, భౌగోళిక సమగ్రతకు గట్టి మద్దతు ఇచ్చిందని అన్నారు.
కాగా, సైప్రస్ సమస్యపై భారత్ ముక్తకంఠంతో మద్దతు ఇచ్చినందుకు తన ప్రియతమ మిత్రుడు మోదీకి, భారత్‌కు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సైప్రస్ అధ్యక్షుడు చెప్పారు. భారత దేశం దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదంతో పోరాడుతుండగా, భౌగోళికంగా కీలకమైన ప్రాంతంలో ఉన్న దృష్ట్యా సైప్రస్ ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ముప్పును బాగా అర్థం చేసుకుందని మోదీ చెప్పారు. తమ ప్రాంతాల్లోని ఉగ్రవాద అడ్డాలకు ఆశ్రయం ఇచ్చి పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలపై అన్ని దేశాలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని తామిరువురమూ అంగీకరించామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరుకు ఒక సమగ్రమైన న్యాయపరమైన నిబంధనావళిని రూపొందించాల్సిన అవసరం ఉందని మోదీ అంటూ, ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించిన అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వీలయినంత త్వరగా ఆమోదించాలని కోరారు.
కాగా, సైప్రస్‌లో పెట్టుబడులు పెట్టాలని అనస్టాసియాడెస్ భారతీయ కంపెనీలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సైప్రస్ అధ్యక్షుడితో సమావేశమై ద్వైపాక్షిక సహకారానికి అవకాశం ఉన్న రంగాలపై ఆయనతో చర్చించారు.

చిత్రాలు..సైప్రస్ అధ్యక్షుడికి శుక్రవారం ఢిల్లీలో స్వాగతం పలుకుతున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ
* గాంధీ సమాధి వద్ద నివాళి