జాతీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతమే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, ఏప్రిల్ 30: కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సిద్ధాంతమూ లేదని, ఎందుకంటే స్వాతంత్య్రానికి పూర్వం ప్రజా ఉద్యమంలో భాగంగా ఆ పార్టీని ఏర్పాటు చేశారని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అంతేకాదు, ఒకే కుటుంబం ప్రయోజనాలకు పరిమితమైన ఆపార్టీ దేశ ప్రయోజనాల కోసం పని చేయజాలదని కూడా ఆయన అన్నారు. ఆనువంశిక పాలనపై ఆయన విమర్శలు చేస్తూ, 1982లో తాను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా బిజెపిలో ఒక మామూలు సభ్యుడిగా చేరానని, అయినప్పటికీ పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి ఎదిగానని శనివారం ఇక్కడ ఓ సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ, ప్రధాని నరేంద్ర మోదీలు పార్టీ తొలితరం నేతలని, వారికెవరికీ రాజకీయ నేపథ్యం లేదని, అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ఇదని అమిత్ షా అన్నారు. ‘నా తర్వాత బిజెపి అధ్యక్షుడు ఎవరో మీరు చెప్పగలరా? చెప్పలేరు. అయితే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ తర్వాత పార్టీ అధ్యక్షుడు ఎవరవుతారో ఎవరైనా సులువుగా చెప్పగలరు’ అని ఆయన అన్నారు. మిగతా పార్టీల మాదిరి కాకుండా బిజెపి అట్టడుగు స్థాయినుంచి పార్టీ కోసం చేసిన సేవ, అంకిత భావం, ముందు చూపు, వ్యక్తిత్వం లాంటి వాటి ఆధారంగా తన నాయకత్వాన్ని ఎంపిక చేస్తుందని చెప్తూ, బిజెపికి, మిగతా పార్టీలకున్న తేడా అదేనన్నారు. దేశంలో 1650 రాజకీయ పార్టీలుంటే కేవలం బిజెపి, సిపిఎం మాత్రమే తమ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకొంటూ వస్తున్నాయని ఆయన అన్నారు. స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబానికే పరిమితమైందని, ఈ కుటుంబ రాజకీయాల కారణంగానే మిగతా పార్టీలు దానికి దూరమైనాయని అమిత్ షా అన్నారు. బిజెపికి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరిన అమిత్ షా సరిహద్దు రాష్టమ్రైన జమ్మూ, కాశ్మీర్ పార్టీకి, జాతీయతా వాదులకు అధికార కేంద్రం కావాలని అన్నారు.

చిత్రం..జమ్ము పర్యటనలో ఉన్న బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం
శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న దృశ్యం