జాతీయ వార్తలు

ఏడేళ్ల తరువాత ఒక్కటయ్యారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రపర (ఒడిశా), ఏప్రిల్ 30: ఏడేళ్ల క్రితం దూరమైన తమ కుమార్తెను తిరిగి కలవడానికి ఆ దంపతులకు ఏడేళ్లు పట్టింది. ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు చెందిన శ్యామ్ ఖౌదియా, ముని ఖౌదియా దంపతులు ఏడేళ్ల క్రితం తప్పిపోయిన తమ కుమార్తె పూజ ఖౌదియాను ఎట్టకేలకు శనివారం దగ్గరికి తీసుకోగలిగారు. 12 ఏళ్ల పూజ 2010లో తల్లిదండ్రులతో కలిసి పూరి వెళ్లినప్పుడు తప్పిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో గల చైల్డ్‌కేర్ ఇన్‌స్టిట్యూట్‌కు చేరింది. పెద్దదయిన పూజ గూగుల్‌లో ప్రముఖ దేవాలయాలను సెర్చ్ చేస్తుండగా, పూరిలోని జగన్నాథ్ ఆలయం కనపడింది. దాంతో ఆమెకు తాను తప్పిపోయినప్పటి విషయాలు గుర్తుకు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె చైల్డ్‌కేర్ సిబ్బందికి చెప్పింది. వారు నెల్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నెల్లూరు పోలీసులు పూరిలోని పోలీసులకు సమాచారం ఇచ్చారని జగత్‌సింగ్‌పూర్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెందిన శిశు సంరక్షణాధికారి ఉదయనాథ్ స్వాయిన్ తెలిపారు. ఏడేళ్ల క్రితం నాటి అదృశ్యమైన ఫిర్యాదులను తనిఖీ చేయగా, పూరి జిల్లాలోని నిమపడ ప్రాంతానికి చెందిన ఒక దంపతులు ఇచ్చిన ఫిర్యాదు దొరికింది. ఆరా తీయగా ఆ దంపతులు 2011లో జగత్‌సింగ్‌పూర్‌కు మకాం మార్చినట్లు తేలింది. చివరకు ఆ దంపతులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, వారికి నెల్లూరు నుంచి వచ్చిన ఫొటోలను చూపించారు. వారి దగ్గరనుంచి కుటుంబ చిత్రాలను పూజకు పంపించారు. ఆ దంపతులు తమ కుమార్తెను, పూజ తన తల్లిదండ్రులను గుర్తించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూజను ఇక్కడికి తీసుకువచ్చి న్యాయపరమైన లాంఛనాలు ముగించిన తరువాత శనివారం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.