జాతీయ వార్తలు

యోగీ చెంత హంతక ఎమ్మెల్యే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, ఏప్రిల్ 30: గోరఖ్‌పూర్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్యే అమన్మణి త్రిపాఠీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో వేదికను పంచుకోవడమే కాకుండా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం బిజెపి కార్యకర్తలతోపాటుగా పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. పొరుగున ఉన్న మహరాజ్ గంజ్ జిల్లా నౌతన్వా నియోజకవర్గంనుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన త్రిపాఠీ వేదికపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కొన్ని సీట్ల దూరంగా కూర్చుని ఉండడం కనిపించింది. ఆ తర్వాత ఆయన తన సీట్లోంచి లేచి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి అభివాదం చేయడమే కాకుండా ఆయన పాదాలు తాకి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రితో కొద్దిసేపు మాట్లాడిన ఎమ్మెల్యే ఆయనకు కొన్ని కాగితాలు కూడా ఇచ్చారు. 35 ఏళ్ల త్రిపాఠీపై తన భార్య సారాను హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా, త్రిపాఠీ ముఖ్యమంత్రి పాదాలు తాకి నమస్కరించిన విషయం తనకు తర్వాత తెలిసిందని ఈ కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించిన కాంపియార్ గంజ్‌కు చెందిన సీనియర్ బిజెపి ఎమ్మెల్యే ఫతే బహదూర్ సింగ్ చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణే తన తొలి ప్రాధాన్యతగా అనేక సందర్భాల్లో చెప్పిన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌తో హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యే వేదిక పంచుకోవడం బిజెపి కార్యకర్తలకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ప్రజా ప్రతినిధులెవరైనా సరే ముఖ్యమంత్రికి అభివాదం చేయవచ్చని బిజెపి గోరఖ్‌పూర్ విభాగం ప్రతినిధి సత్యేంద సిన్హా వ్యాఖ్యానించారు. అమన్‌మణి తండ్రి అమరమణి త్రిపాఠీ నౌతన్వా నియోజకవర్గంనుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాక సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు.