జాతీయ వార్తలు

ప్రధానినీ విచారణకు పిలవొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచి, ఏప్రిల్ 30: ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రి మండలిలోని ఎవరినయినా విచారణకు పిలిచే అధికారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి)కి ఉందని ఆ కమిటీ చైర్మన్ కెవి థామస్ ఆదివారం పునరుద్ఘాటించారు. పిఎసి సమావేశానికి అధ్యక్షత వహించడానికి ప్రస్తుతం గ్యాంగ్‌టక్‌లో ఉన్న థామస్ ఒక వార్తాసంస్థతో ఫోన్‌లో మాట్లాడుతూ, లోక్‌సభ స్పీకర్ అనుమతిస్తే, పిఎసిలోని సభ్యులందరూ అంగీకరిస్తే ప్రధానమంత్రిని ఆయనకు సంబంధించిన అంశాలలో విచారణకు పిలిచే అధికారం పిఎసికి ఉందని పేర్కొన్నారు. ‘కేంద్ర క్యాబినెట్ మంత్రిని పిలవగలిగినప్పుడు, ప్రధానమంత్రిని ఎందుకు పిలవలేము.. మన వ్యవస్థలో సమానులయిన అందరిలో ప్రధానమంత్రి తొలి వ్యక్తి’ అని థామస్ అన్నారు. పిఎసి చైర్మన్‌గా థామస్ పదవీకాలం ఆదివారంతో ముగుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే సోమవారం పిఎసి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వరుసగా మూడు దఫాలు పిఎసి చైర్మన్‌గా పనిచేసిన థామస్.. ప్రధానమంత్రిని విచారణకు హాజరు కావాలంటూ పిలవడానికి నియమనిబంధనలు అనుమతిస్తున్నాయని వాదించారు. పెద్దనోట్లను రద్దు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై జనవరిలో ఇదే అభిప్రాయాన్ని వెల్లడించినందుకు థామస్‌కు వ్యతిరేకంగా హక్కుల నోటీసు ఇవ్వాలని పిఎసిలోని ఒక సభ్యుడు చేసిన డిమాండ్ గురించి ప్రస్తావించగా, ‘ఈ అంశంపై నా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు’ అని ఆయన బదులిచ్చారు. థామస్ జనవరి 9న ఇక్కడ విలేఖరుల సమావేశంలో ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చే వ్యాఖ్యలు చేయడానికి పిఎసిని ఉపయోగించుకున్నారని ఆరోపిస్తూ, అందువల్ల ఆయనకు వ్యతిరేకంగా హక్కుల నోటీసు ఇవ్వాలని అప్పట్లో బిజెపికి చెందిన పిఎసి సభ్యుడు నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. తన అధ్యక్షతన గల పిఎసిలో 21 మంది సభ్యులుండగా, అందులో 12 మంది బిజెపికి చెందినవారేనని థామస్ తెలిపారు. తాను వరుసగా మూడు దఫాలు పిఎసి చైర్మన్‌గా వ్యవహరించానని, పిఎసి చైర్మన్ పదవీకాలాన్ని మూడోసారి పొడిగించడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు.