జాతీయ వార్తలు

ఉగ్రదాడులపై హోంమంత్రి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: దేశ సరిహద్దులో, మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల్లో తాజా పరిస్థితులను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం సమీక్షించారు. ప్రధానంగా జమ్మూకాశ్మీర్ సరిహద్దులో ఇద్దరు జవాన్లు మృతిచెందిన ఘటనపై కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. అక్కడ పరిస్థితులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర హోమ్‌శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి, ఇంటిలిజెన్స్ అధిపతులు రాజ్‌నాథ్‌కు పరిస్థితి మొత్తం వివరించారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై వారు పలు సూచనలు చేశారు. అంతర్జాతీయ సరిహద్దులో పటిష్టమైన నిఘా ఉంచడంతోపాటు పూర్తి అప్రమత్తత పాటించాలని హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా బిఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులను సింగ్ అప్రమత్తం చేశారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఏప్రిల్ 24న సుక్మాలో జరిగిన మావోయిస్టుల దాడిలో 25 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. నక్సల్స్‌ను అణచివేయడానికి కఠినంగా వ్యవహరించాలని, ఏరివేత ఆపరేషన్ కొనసాగించాలని హోమ్ మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆదేశించింది. కాశ్మీర్ లోయ ప్రాంతంలో అశాంతి పరిస్థితులూ ఉన్నతస్థాయి సమావేశంలో చర్చకు వచ్చిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 9న శ్రీనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా పెచ్చరిల్లిన హింసపైనా సమీక్షించారు.