జాతీయ వార్తలు

బిహార్‌లో రైలు ఢీకొని 9మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షేఖ్‌పురా/లఖిసరాయ్, మే 1: బిహార్‌లోని సరాయ్ స్టేషన్‌లో పట్టాలు దాటుతున్న వారిని అటుగా వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొన్న సంఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హృదయ విదారకమైన ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. రామ్‌పూర్‌ఘాట్-గయ ప్యాసింజర్ రైలు నుంచి దిగిన కొంతమంది ప్రయాణికులు ఫుట్‌వోవర్ బ్రిడ్జి ఎక్కకుండా పట్టాలు దాటే ప్రయత్నం చేశారు. అదే సమయంలో మరో పట్టాపై ప్రయాణిస్తున్న గూడ్స్ రైలు పట్టాలపై ఉన్నవారిని ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారని రైల్వే అధికారులు తెలిపారు. మరణించినవారిని సురేష్ యాదవ్ (50), సరోజ్ దేవి (45), రోహిత్ (10), ఆషా దేవి (50), పురుషోత్తం కుమార్ (25), మంగళ్ యాదవ్ (58), మున్ని దేవి (38), సంజయ్ కుమార్ (17), జున్నా కుమారి (12)గా గుర్తించారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు.