జాతీయ వార్తలు

దుర్వినియోగాన్ని సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 1: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ పాలనాపరంగా ఎన్నో సంస్కరణలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడానికి తగిన చర్యలు తీసుకుంటూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలాగని మంచి పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలని అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా పాఠశాలల పిల్లలకోసం ప్రవేశపెట్టిన ‘స్కూల్ బ్యాగ్’ల స్కీం పంపిణీపై యోగి ఆదిత్యనాథ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే రోజుకు బ్యాగ్‌లు విద్యార్థుల చేతుల్లో ఉండాలని సిఎం స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధికోసం ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని సిఎం పేర్కొన్నట్టు అధికారులు తెలిపారు. అఖిలేశ్ హయాంలో 35వేల స్కూల్ బ్యాగులు సిద్ధం చేయించారు. ముఖ్యమంత్రి యోజన, ఉత్తరప్రదేశ్ యోజన పథకం కిందే పంపిణీ చేయాలేతప్ప వ్యక్తిగతంగా ఎవరి పేరూ వాడొద్దని ముఖ్యమంత్రి ఇటీవలే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ హయాంలో ప్రభుత్వ పథకాలన్నింటికీ పార్టీపేరు జతచేసేవారు.