జాతీయ వార్తలు

ఉపాధి కల్పనే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: ఉపాధి కల్పనకే ఎన్డీయే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో దత్తాత్రేయ మాట్లాడారు. దేశంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, వేతనాలు పెంచడమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. దేశంలోని కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ శాఖ ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని కార్మిక చట్టాలను కలిపి సరళీకృతం చేయటం ద్వారా నాలుగు కార్మిక కోడ్స్‌గా కుదిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. కార్మికులు చేస్తున్న త్యాగాలు, అంకితభావంతో కష్టపడి పని చేయటం వల్లే దేశం ఎంతో ప్రగతి సాధిస్తోందని కొనియాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తమ శాఖ దేశంలోని కోట్లాది మంది సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఉపాధి భద్రతతో సమ్మిళిత అభివృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కార్మికులు, వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పిస్తున్నామని, ఈ లక్ష్య సాధనకోసం లెజిస్లేటివ్ సంస్కరణలు అమలు చేస్తున్నామని దత్తాత్రేయ తెలిపారు. మొత్తం కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్స్‌గా కుదిస్తున్నామని, వేతనాలకు సంబంధించి ఒక కోడ్, పారిశ్రామిక సంబంధాలకు ఒక కోడ్, సామాజిక భద్రత, సంక్షేమానికి సంబంధించి ఒక కోడ్, పని పరిస్థితులు, వృత్తిపరమైన భద్రతకు సంబంధించింది మరో కోడ్ అని దత్తాత్రేయ వివరించారు. బాల కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు, మాడల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, బోనస్ చెల్లింపుల సవరణ చట్టం, మెటర్నెటీ ప్రయోజన సవరణ చట్టం, నష్టపరిహార సవరణ చట్టం, వేతనాల చెల్లింపుల చట్టాలను కార్మికుల సంక్షేమంకోసం పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. నేషనల్ కెరీర్ సర్వీస్ పథకం కింద మూడు కోట్ల 78 లక్షల మంది, 15 లక్షల సంస్థలు దీనికి సంబంధించిన పోర్టల్‌లో రిజిష్టరు చేసుకున్నాయని వివరించారు. ఈ పోర్టల్ పరిధిలోకి ఐదు లక్షల ఖాళీలను తెచ్చామన్నారు. ప్రభుత్వ ఖాళీలను ఈ పోర్టల్‌లో నమోదు చేయటం ఇప్పుడు తప్పనిసరి అని ఆయన ప్రకటించారు. ఎన్‌సిపి కింద దేశంలో వంద మాడల్ కెరీర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని దత్తాత్రేయ వివరించారు. తమ శాఖ గత సంవత్సరం 540 ఉద్యోగ మేళాలు నిర్వహించిందని చెప్పారు.