జాతీయ వార్తలు

పాక్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 9: భారత పౌరుడు కుల్‌భూషణ్ జాదవ్ మరణ శిక్ష కేసులో పాకిస్తాన్‌కు చుక్కెదురైం ది. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారంటూ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు విధించిన మరణ శిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించింది. జాదవ్‌కు దౌత్యపరమైన సహాయాన్ని అందించాలని, అతడి వాదన వినాలంటూ భారత్ అనేక దఫాలుగా స్పష్టం చేసినప్పటికీ పాకిస్తాన్ పెడచెవిన పెట్టింది. అసలు జాదవ్‌పై వచ్చిన అభియోగాలేమిటో తెలియజేసేందుకూ పాకిస్తాన్ నిరాకరించింది. దాంతో ఈ ఉరి శిక్షను నిలిపివేయాలని కోరుతూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది. దీన్ని విచారణకు స్వీకరించిన అంతర్జాతీయ కోర్టు జాదవ్ ఉరి శిక్షపై స్టే విధించింది.