జాతీయ వార్తలు

పాన్‌తో ఆధార్ అనుసంధానం తేలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: ప్రజలు తమ పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్)కు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసుకోవడానికి ఆదాయపు పన్ను శాఖ ఒక కొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం, ఎవరయినా ఆన్‌లైన్‌లో (ఇ-ఫెసిలిటి) తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఇకనుంచి ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి ఎవరయినా తమ పాన్‌కు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆదాయపు పన్ను శాఖ తన ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ (్దఆఆఔఒ:// జశష్యౄళఆ్ఘనజశజూజ్ఘళచిజజశ.్య్ప.జశ)లోని హోమ్‌ఫేజీలో ఒక కొత్త లింక్‌ను ఏర్పాటు చేసింది. ఈ లింక్ ద్వారా ఎవరయినా తమ ఆధార్, పాన్‌లను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ లింక్‌ను క్లిక్ చేసి, అది తెలియజేసే సూచనలను పాటించడం ద్వారా తేలికగా ఆధార్, పాన్‌లను అనుసంధానం చేసుకోవచ్చు.