జాతీయ వార్తలు

ఇవిఎంల స్థానంలో వివిపిఏటీలను వాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: ప్రస్తుతం ఎన్నికల్లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం)ల స్థానంలో వివిపిఏటి (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్)లను ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు గురువారం ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వెలుపల ధర్నా నిర్వహించారు. ఇవిఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని, ఇలా ట్యాంపరింగ్ చేసే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బిజెపి ఘనవిజయం సాధించిందని ఆమ్ ఆద్మీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇలావుండగా వచ్చే ఎన్నికల్లో వివిపిఏటి మిషీన్లను వాడేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇవి అందుబాటులోకి వస్తే ఓటు వేసిన వ్యక్తి తాను ఎవరికైతే ఓటు వేశాడో దానికి సంబంధించిన ప్రింట్ కూడా బయటకు వస్తుంది. దాన్ని వెంటనే పక్కనున్న బాక్స్‌లో వేయాల్సి వుంటుంది. ఇలా చేయడంవల్ల ట్యాంపరింగ్‌ను నివారించవచ్చునని ఆప్ వాదిస్తోంది.