జాతీయ వార్తలు

జైలు శిక్ష రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 11: కోర్టు ధిక్కార కేసులో తనకు విధించిన జైలు శిక్షను ఉపసంహరించుకోవాలని కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ గురువారం సుప్రీం కోర్టును అభ్యర్థించారు. కర్ణన్ తరపున దాఖలైన ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అంగీకరించింది. సుప్రీం ఆదేశాల మేరకు కర్ణన్‌ను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులకు ఆయన చిక్కక పోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. అసలు కర్ణన్ ఎక్కడున్నారని చీఫ్ జస్టిస్ ఖేహర్ ప్రశ్నించడంతో కర్ణన్ చెన్నైలోనే ఉన్నారు. ఎక్కడా దాక్కోలేదు2అని ఆయన తరపు న్యాయవాది మాథ్యూస్ జె నెదుంపర స్పష్టం చేశా రు. అసలు కర్ణనే మిమ్మల్ని ఈ పిటిషన్ దాఖలు చేయాలని కోరినట్టు ఆధారాలు ఏమిటన్న మరో ప్రశ్నకు సమాధానంగా నోటరీ చేసిన అధికారిక పత్రాలను మాథ్యూస్ కోర్టుకు నివేదించారు. కర్ణన్ తరపున వాదించడానికి 12 మంది న్యాయవాదులు నిరాకరించిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఇదిలా ఉండగా, కర్ణన్ ఎక్కడ ఉన్నారన్న దానిపై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. సుప్రీం కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్లను పట్టుకుని పోలీసులు గత రెండు రోజులుగా తిరుగుతున్నా ఆయన ఆచూకీ లభించలేదు. దాంతో ఆయన బంగ్లాదేశ్ లేదా నేపాల్ వెళ్లిపోయిఉంటారని కథనాలు వెలువడ్డాయి. సుప్రీం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసే సరికే కర్ణన్ కోల్‌కతా వదిలి వెళ్లిపోయారు. చెన్నైలో ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్నట్టు తెలిసి హుటాహుటిన పోలీసులు అక్కడికి వెళ్లారు. అయితే ఆయన అక్కడా లేరు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తిలో ఉన్నట్టు వార్తలు హల్‌చల్ చేశాయి. ఇదిలా ఉండగా, తనకు విధించిన జైలుశిక్షపై కర్ణన్ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జిని కలిసే అకాశం ఉందని ఓ ఆంగ్లపత్రిక పేర్కొంది. దీని కోసమే ఆయన బంగ్లాదేశ్ లేదా నేపాల్ వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.