జాతీయ వార్తలు

‘హెరాల్డ్’ దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఇద్దరినీ ఆదాయం పన్ను శాఖ అధికారులు ప్రశ్నించడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం అనుమతించింది. సోనియా, రాహుల్ వాటాదారులుగా ఉండే యంగ్ ఇండియాకు సంబంధించిన ఆదాయ పన్ను పత్రాలను ఆ శాఖకు సమర్పించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన నిధుల దుర్వినియోగంలో సోనియా, రాహుల్‌లకు సంబంధం ఉందని ఆరోపిస్తూ బిజెపి సీనియర్ నాయకుడు, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. అయితే స్వామి ఆరోపణలను తోసిపుచ్చిన సోనియా, రాహుల్ తోసిపుచ్చుతూ, పిటిషన్‌ను కొట్టివేయాలని అంతకు ముందు వాదించారు. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియా, రాహుల్ డైరెక్టర్లుగా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు కాంగ్రెస్ పార్టీ రూ.90.25 కోట్ల నిధులిచ్చింది. నిధులను వసూలు చేసుకునే హక్కును కేవలం 50 లక్షల రూపాయలకు యంగ్ ఇండియన్ కంపెనీకి కట్టబెట్టారనేది సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన ఆరోపణ. వందల కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కేవలం 50 లక్షలలతో కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ కేసులో ఈ ఇద్దరే కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, శామ్ పిట్రోడా కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 2014 జూన్ 26న యంగ్ ఇండియాతో పాటుగా సోనియా, రాహుల్ ప్రభృతులకు సమన్లు జారీ చేసింది.