జాతీయ వార్తలు

ట్రిపుల్ తలాఖ్ ఘోరాతిఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12: ముస్లిం మగవారు విడాకులు ఇచ్చేందుకు పాటించే ట్రిపుల్ తలాఖ్ విధానం చట్టబద్ధమైందని వాదించే మేధావి వర్గాలు కొన్ని ఉన్నప్పటికీ ఇది అత్యంత ఘోరమైందని, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. ట్రిపుల్ తలాఖ్ చట్టబద్ధమైందా? కాదా? అనే విషయంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం నుంచి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. విచారణ రెండో రోజు శుక్రవారం ఈ కేసులో కోర్టుకు సహాయకుడి (అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ ఇది జ్యుడీషియల్ స్క్రూటినీ అవసరమైన విషయం కాదని, అంతేకాకుండా నిఖానామా( పెళ్లి కాంట్రాక్ట్‌పత్రం)లో ఒక షరతును చేర్చడం ద్వారా ట్రిపుల్ తలాఖ్ ఇష్టం లేదని చెప్పే హక్కు ముస్లిం మహిళలకు ఉందని చెప్పినప్పుడు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. కాగా, ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధించిన ముస్లిం, ముస్లిమేతర దేశాల జాబితా తయారు చేయాలని ఖుర్షీద్‌ను బెంచ్ కోరింది. పాకిస్తాన్, అఫ్గానిస్థాన్, మొరాకో, సౌదీ అరేబియాలాంటి ముస్లిం దేశాలు సైతం వివాహాన్ని రద్దు చేసుకోవడానికి ట్రిపుల్ తలాఖ్‌ను ఒక మార్గంగా అనుమతించడం లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. కాగా, ట్రిపుల్ తలాఖ్ పద్ధతి ముస్లిం మహిళలపట్ల వివక్ష చూపిస్తోందని, విడాకులు ఇచ్చేందుకు అందులో మహిళలకు సమాన హక్కులు లేవని, బాధితుల్లో ఒకరి తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది రాంజెత్మలానీ దుయ్యబట్టారు. ట్రిపుల్ తలాఖ్‌తో విడాకులు తీసుకునే హక్కు కేవలం భర్తకే ఉంది తప్ప భార్యకు లేదని, ఇది సమాన హక్కులకు సంబంధించిన రాజ్యాంగంలోని 14వ అధికరణకు వ్యతిరేకమని వాదించారు. ‘విడాకులు మంజూరు చేసే ఈ విధానంలో దయకు ఎలాంటి స్థానమూ లేదు. ఏకపక్షంగా వివాహాన్ని రద్దు చేసుకోవడం అనేది అత్యంత ఘోరమైంది. అందువల్ల దాన్ని పాటించకూడదు’ అని ఆయన అన్నారు. ట్రిపుల్ తలాఖ్ అనేది పురుషుడికి, మహిళకు మధ్య తేడా చూపిస్తుందని, అంతేకాదు పవిత్ర ఖురాన్‌లోని సూత్రాలకు సైతం ఇది విరుద్ధమని, రాజ్యాంగంలోని నిబంధనలకు సైతం వ్యతిరేకమైన ఈ ఆచారాన్ని ఏ వాదనా కాపాడలేదని రాంజెత్మలానీ అన్నారు. భర్త దయాదాక్షిణ్యాలపై భార్యను, మాజీ భార్యగా చేసే ఆచారాన్ని ఏ చట్టం కూడా అనుమతించదని ఆయన అంటూ, ఇది అత్యంత దారుణమైన రాజ్యాంగ వ్యతిరేక ప్రవర్తన అన్నారు.