జాతీయ వార్తలు

అన్నీ ఆలోచించే కర్ణన్‌కు జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 12:కోర్టు ధిక్కార నేరంపై కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సిఎస్ కర్ణన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించడమన్నది ఆన్ని అంశాలను బేరీజు వేసుకుని తీసుకున్న నిర్ణయమేనని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ సారధ్యంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. మరో నలుగురు న్యాయమూర్తులతో కలిసి ట్రిపుల్ తలాఖ్ అంశాన్ని విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మధ్యాహ్న భోజన అనంతరం నలుగురు సభ్యుల బెంచి సమావేశమైనప్పుడు కర్ణన్ తరపున్యాయవాది నెదుంపర ఆయన దాఖలు చేసిన రీకాల్ పిటిషన్‌ను ప్రస్తావించారు. ‘ప్రస్తుత బెంచి వేరే అంశాన్ని విచారిస్తోంది. ఇక్కడ మీరు కర్ణన్ పిటిషన్ గురించి ప్రస్తావించకూడదు. రిజిస్ట్రీని సంప్రదించండి’అని సిజె ఖేహర్ ఆయనకు స్పష్టం చేశారు. అయితే నేను ‘బెంచితో కాదు సిజెతోనే మాట్లాడుతున్నాను’అని కర్ణన్ న్యాయవాది అనడంతో ఆగ్రహించిన ఖేహర్ ‘మీరు ప్రతిసారి ఇక్కడికే వస్తున్నారు. వెళ్లి పిటిషన్ కాపీని రిజిస్ట్రీకి ఇవ్వండి’అంటూ ఆయనపై మండిపడ్డారు. ‘మీరు ఉన్న పద్ధతిని అంగీకరించడం లేదు. మీ వాదనే వినిపిస్తున్నారు’అని కూడా సిజె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.దాంతో కర్ణన్ న్యాయవాది అక్కడి నుంచి నిష్క్రమించారు. సుప్రీం బెంచి తలాఖ్‌పై విచారణ కొనసాగించింది. అయినా వదలని కర్ణన్ న్యాయవాది తలాఖ్ విచారణ పూర్తయిన తర్వాత కూడా తన వాదనను వినిపించేందుకు నెదుంపర ప్రయత్నించినా ఫలించలేదు. ఆయన వాదన వినకుండానే బెంచి సభ్యులు వెళ్లి పోయారు. అంటే లంచ్ బ్రేక్‌కు ముందు, తర్వాతా, తలాఖ్ విచారణ అనంతరం మొత్తం మూడుసార్లు పట్టువదలని రీతిలోనే కర్ణన్ పిటిషన్‌ను సిజె దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.