జాతీయ వార్తలు

కుట్రపూరితంగా చరిత్ర వక్రీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 14: చరిత్రలో మరుగున పడిన వ్యక్తులను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం పాఠ్యాంశాలను మార్చడంపై సమాజంలోని అన్ని వర్గాల వారి నుంచి సలహాలు స్వీకరిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. చరిత్రను వక్రీకరించిన వారిని బహిర్గతం చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) ఆదివారం ఇక్కడ నిర్వహించిన ‘హిందూ విజయోత్సవ్’ కార్యక్రమంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మహమూద్ ఘజ్‌నవి, అల్లాఉద్దీన్ ఖిల్జీ, బాబర్, ఔరంగజేబు వంటి వారికి పాఠ్యాంశాల్లో చోటు కల్పించాలా? అనేది నిర్ణయించవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘మహారాజా సుహేల్‌దేవ్, ఇతర గొప్ప వ్యక్తులను కుట్రపూరితంగా చరిత్ర నుంచి తొలగించారు. చరిత్రను వక్రీకరించిన వారిని బయటపెట్టవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసికెళ్తాం’ అని ఆదిత్యనాథ్ అన్నారు. ‘దేశంపైకి దండెత్తి వచ్చిన విదేశీ ఆక్రమణదారు సాయెద్ సాలార్ మసూద్ ఘజిని ఓడించిన మహారాజా సుహేల్‌దేవ్‌ను కుట్రపూరితంగా మరుగున పరిచారు. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని చీల్చడానికి చరిత్రను వక్రీకరించారు. అయితే అది దాగదు. చరిత్రను సరిదిద్దవలసిన రోజు ఆసన్నమయింది.
ప్రజలు చరిత్రను వక్రీకరించిన వారిని గుర్తిస్తారు’ అని ఆదిత్యనాథ్ అన్నారు. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని పాసి, రాజ్‌భర్ కులాలకు చెందిన ప్రజలను బుజ్జగించడానికి, ఆకర్షించడానికి బిజెపి ప్రయత్నిస్తూ వస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్, దాని చుట్టుపక్కల ప్రాంతాలను యోధుడయిన రాజు సుహేల్‌దేవ్ పాలించాడు. పాసి, రాజ్‌భర్ కులాల ప్రజల ఆదరాభిమానాలను ఆయన పొందాడు. ఈ నేపథ్యంలో సుహేల్‌దేవ్ గురించి సిఎం ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో తమ వంతు పాత్ర పోషించిన గొప్ప వ్యక్తులను గౌరవించే పనిని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిందని ఆదిత్యనాథ్ అన్నారు. ‘ఎవరు మతతత్వవాది? ఎవరు జాతీయవాది?’ అనే దానిని నిశ్చయించడానికి మతతత్వంపై చర్చ జరగాలని ఆదిత్యనాథ్ సూచించారు.