జాతీయ వార్తలు

ఫ్లైఓవర్ మీదనుంచి పడిపోయిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ఢిల్లీలో ఓ కారు ఫ్లైఓవర్ మీదినుంచి కిందికి పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు మృతిచెందగా, మరో ఐదురుగు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న ఏడుగురు విద్యార్థులు పరీక్ష రాసేందుకు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఢిల్లీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్‌లో మొదటి సంవత్సరం చదువుతున్నారు. నరేలాలోని ఐపి కాలేజీలో సెకండ్ సెమిస్టర్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ ఫ్లైఓవర్‌పై కారు అదుపు తప్పి కిందికి పడిపోయింది. మృతిచెందిన విద్యార్థులను సంచిత్, రీతుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ప్రణవ్, గరిమ, రిషబ్, రజత్, రాజాలను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా పంజాబీబాగ్‌లోని రజత్ ఇంటివద్ద కలుసుకుని అక్కడినుంచి పరీక్ష రాసేందుకు కారులో బయలుదేరారు.