జాతీయ వార్తలు

సంభాషణల సిడిని ఇప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపానని నమోదయిన కేసులో తాను సహ నిందితుడితో జరిపినట్టు పేర్కొంటూ రికార్డు చేసిన టెలిఫోన్ సంభాషణలతో కూడిన సిడి కాపీని ఇవ్వవలసిందిగా ఎఐఎడిఎంకె (అమ్మ) వర్గం నాయకుడు టిటివి దినకరన్ సోమవారం ప్రత్యేక కోర్టును కోరారు. జుడీషియల్ కస్టడీలో ఉన్న దినకరన్‌ను అతని స్వర నమూనాలు తీసుకోవడానికి సమ్మతించాల్సిందిగా ఢిల్లీ పోలీసులు కోరినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. దినకరన్‌కు, మధ్యవర్తిగా అభియోగాలు ఎదుర్కొంటూ, అరెస్టయిన సుకేశ్ చంద్రశేఖర్‌కు మధ్య జరిగినట్లుగా పేర్కొంటున్న టెలిఫోన్ సంభాషణలతో కూడిన సిడి కాపీని తనకు ఇవ్వాలని దినకరన్ తరపు న్యాయవాది ప్రత్యేక న్యాయమూర్తి పూనం చౌదరిని కోరారు. ఈ సిడిలోని సంభాషణలను పరిశీలించిన తరువాత దినకరన్ స్వర నమూనాలు సేకరించడానికి సమ్మతించాలా లేదా అనే విషయాన్ని నిర్ణయిస్తానని న్యాయవాది చెప్పారు. దినకరన్, అతని సన్నిహిత సహచరుడు మల్లికార్జున, హవాలా ఆపరేటర్‌గా అభియోగాలు ఎదుర్కొంటున్న నాథు సింగ్‌లను జైలులోనుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు వీరి జుడీషియల్ కస్టడీని మే 29 వరకు పొడిగించింది. చంద్రశేఖర్ తన స్వర నమూనాలు ఇవ్వడానికి నిరాకరించాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన అనేక తీర్పులను ఉటంకిస్తూ, ఇలా నిరాకరించే హక్కు తనకు ఉందని పేర్కొన్నాడు. దినకరన్, చంద్రశేఖర్‌ల స్వర నమూనాలు కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ నెల 18న వాదనలు వింటుంది.