జాతీయ వార్తలు

ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు నిధులు కేటాయిస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, తాగునీటి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హామీ ఇచ్చినట్లు లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య తెలిపారు. ఆయన మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేశారు. తాను ఈ రోజు నరేంద్ర తోమర్‌ను ఆయన కార్యాలయంలో కలుసుకుని తన లోక్‌సభ నియోజకవర్గం నాగర్ కర్నూలులో ప్రజలు తాగునీటిలో ఫ్లోరైడ్ ఉండటం వలన ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆరోగ్య సమస్యల గురించి వివరించినట్లు పేర్కొన్నారు. నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏదైనా పథకాన్ని తయారు చేసి పంపిస్తే తమ శాఖ ఆర్థిక సహాయం అందజేసేందుకు సిద్ధంగా ఉన్నదని నరేంద్రసింగ్ తోమర్ హామీ ఇచ్చారని ఎల్లయ్య చెప్పారు. ఈ నియోజకవర్గం ప్రాంతంలోని తాగునీటిలో ఉన్న ఫ్లోరైడ్ మూలంగా ప్రజలు రక,రకాల అనారోగ్యానికి గురి అవుతున్నారు, ప్రజలను కాపాడాలంటే వాటికి సురక్షిత మంచినీటిని సరఫరా చేయటం ఒక్కటే దారి అని ఆయన సూచించారు. నాగర్ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్యపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా ఒక లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.