జాతీయ వార్తలు

కక్ష సాధింపులకు భయపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ప్రతీకారం, కక్ష సాధింపు చర్యలే నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం డిఎన్‌ఏగా మారాయని, అయితే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు రాజకీయాలకు తమ పార్టీ నేతలు, ప్రతిపక్షాల నేతలు ఎవరూ బెదిరిపోరని కాంగ్రెస్ పార్టీ మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. బిజెపి ప్రతీకారంతో కళ్లు మూసుకుపోయి ప్రతిపక్షాలకు చెందిన నేతలను టార్గెట్ చేస్తోందని, కాషాయ పార్టీ అసలు స్వరూపాన్ని ప్రజల ముందు పెడతామని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్‌ల నివాసాల్లో మంగళవారం సిబిఐ తనిఖీలు నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘వాస్తవం ఏమిటంటే ప్రతీకారం, కక్షసాధింపులు బిజెపి ప్రభుత్వం డిఎన్‌ఏగా తయారైంది’ అని ఏఐసిసి కమ్యూనికేషన్స్ విభాగం ఇన్‌చార్జి రణదీప్ సుర్జేవాలా విలేఖరులతో అన్నారు. బిజెపి కక్షసాధింపు రాజకీయాలకు భయపడి చిదంబరం లేదా కాంగ్రెస్ లేదా ప్రతిపక్షాలకు చెందిన నాయకులెవరు కూడా బెదిరిపోరని తాము మరోసారి స్పష్టం చేయదలిచామని అన్నారు. అంతేకాదు బిజెపి అవినీతి పార్టీ అని ఆయన ఆరోపిస్తూ, ఈ ప్రభుత్వంలో మంత్రి పదవుల్లో ఉన్నవారికి సంబంధాలున్నాయని అన్నారు. ‘ఒకవేళ నైతికతే కొలబద్ద అయిన పక్షంలో లంచాలు తీసుకున్నవారి జాబితాలో తన పేరు పదే పదే పేర్కొన్న సహారా-బిర్లా ఎక్సెల్ పత్రాలపై దర్యాప్తుకు ప్రధాని ఎందుకు వెనకాడుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం’ అని సుర్జేవాలా అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కుంభకోణం, మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం అవినీతి కాదా? అని మోదీని ప్రశ్నించారు. అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుధరా రాజె, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్- మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ లాంటి వ్యక్తులు దేశం వదిలిపెట్టి వెళ్లడానికి సాయపడ్డారని ఆయన ఆరోపించారు. విజయ్ మాల్యాలాంటి వ్యక్తులు దేశంనుంచి పారిపోవడానికి తోడ్పడింది ఎవరని కూడా ఆయన ప్రశ్నించారు.