జాతీయ వార్తలు

‘ఉమ్మడి’పై కాస్త నెమ్మదిగా వెళ్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్ నివేదికలో కొంత జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రిపుల్ తలాఖ్‌పై సుప్రీం కోర్టు తీర్పును వెలువరించాల్సి ఉన్నందున వేచి చూద్దామన్న ధోరణిలో లా కమిషన్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలద్వారా తెలిసింది. ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించి అనేక సంక్లిష్ట న్యాయపరమైన అంశాలు ఉన్నందున తలాఖ్‌పై తేలేవరకూ ముందుకు వెళ్లకూడదని నిర్ణయించినట్టు ప్యానెల్ సభ్యుడొకరు వెల్లడించారు. సుప్రీం కోర్టు వెలువరించే తీర్పు ప్యానెల్ ముసాయిదా నివేదికకు మార్గదర్శకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఒకసారి రోడ్ మ్యాప్ తయారైతే భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు ప్రారంభించవచ్చని చెప్పారు.