జాతీయ వార్తలు

రాజ్యాంగ నిబద్ధతకు విఘాతం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: ట్రిపుల్ తలాఖ్ ముస్లింలకు పవిత్రమైనదని, 1400ఏళ్లుగా ఎంతో నమ్మకంతో ఆచరిస్తున్న విధానమని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీం కోర్టుకు విన్నవించింది. అప్పటినుంచీ దీన్ని ఆచరిస్తున్నా స్ర్తి-పురుష సమానత్వానికి గాని, రాజ్యాంగ నిబద్ధతకు గాని ఎటువంటి విఘాతం కలగలేదని స్పష్టం చేసింది. ‘ట్రిపుల్ తలాఖ్ విధానం 637 నుంచి ముస్లిం సమాజం ఆచరిస్తోంది. ఇది ఇస్లాం మతానికి వ్యతిరేకం కాదు. అందువల్ల రాజ్యాంగానికి వ్యతిరేకం అనే సమస్యే లేదు’ అని పర్సనల్ లా బోర్డు తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. ‘రాముడు అయోధ్యలోనే పుట్టాడని హిందువులు ఎంతగా నమ్ముతారో, ట్రిపుల్ తలాఖ్‌ను కూడా ముస్లింలు అంతగా నమ్ముతారు’ అని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు వివరించారు. ఇలావుండగా ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధమని తేల్చిన పక్షంలో వారి వివాహానికి, విడాకులకు సంబంధించి కొత్త చట్టం తీసుకువస్తామని కేంద్రం సోమవారం కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూరి ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం ట్రిపుల్ తలాఖ్ అంశంపై గత నాలుగు రోజులుగా విచారిస్తోంది.