జాతీయ వార్తలు

డార్జిలింగ్‌లో సచివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డార్జిలింగ్, జూన్ 8: పశ్చిమ బెంగాల్‌లో పర్వత ప్రాంత అభివృద్ధి కోసం డార్జిలింగ్‌లో కొత్తగా సచివాలయం ఏర్పాటు చేయాలని మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూ ల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ‘డార్జిలింగ్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించాం. కొత్త సచివాలయానికి టెన్సింగ్ నార్కే పేరు పెడతాం’ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ఆరు నెలల్లోనే భవన నిర్మాణం ప్రారంభిస్తామని ఆమె వెల్లడించారు. గురువారం కేబినెట్ సమావేశానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాలుగా పర్వత ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుం డా పోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశా రు. ‘హిల్ ఏరియా ప్రజలు ఎప్పటి నుంచో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కాబట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వారి జీవితాల్లో ఉషస్సులు తీసుకొస్తాం’ అని ఆమె స్పష్టం చేశారు. తమ బాగోగులు పట్టించుకోవాలని పర్వతప్రాంత ప్రజలు ఎప్పటినుంచో అడుగుతూ వస్తున్నారని అయితే 34 ఏళ్లపాటు అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం వారి ని అసలు పట్టించుకోలేదని మమత నిప్పు లు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, తాను ముఖ్యమంత్రిగా హిల్ ఏరియాను వంద సార్లు కంటే ఎక్కువే సందర్శించానని పేర్కొన్నారు. తాము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే గూర్ఖా జన విమక్తి (జిజె ఎం) అభాండాలు వేస్తోందని మమత ధ్వజమెత్తారు.