జాతీయ వార్తలు

రాజధానిలో ఎన్‌డిఆర్‌ఎఫ్ స్థావరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: దేశ రాజధాని ఢిల్లీలో ఎలాంటి యుద్ధ ప్రమాదాన్ని అయినా ఎదుర్కోవటానికి వీలుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఆర్‌ఎఫ్) శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజధానిపై జీవ రసాయనాయుధాల దాడి, అణ్వస్త్ర దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా సాయుధ సంపత్తితో ఎన్‌డిఆర్‌ఎఫ్‌ను సంసిద్ధం చేశారు. ఢిల్లీలోని ఆర్కేపురంలో ఏర్పాటు చేసిన ఈ దళంలో 30మంది సుశిక్షుతులైన సిబ్బంది ఉంటారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇండియాగేట్ వంటి ప్రాంతాల్లో ఇటీవల జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో కట్టుదిట్టంగా ఈ దళాన్ని సిద్ధం చేశారు. జీవ రసాయన దాడులతో పాటు రేడియోలాజికల్ దాడులను సమర్థంగా ఎదుర్కోవటానికి వీరు సిద్ధంగా ఉంటారని సీనియర్ అధికారి ఆదివారం తెలిపారు.