జాతీయ వార్తలు

భార్యను చంపేసి తలతో పోలీస్‌స్టేషన్‌కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లఖింపూర్‌ఖేరి (యూపీ), జూన్ 12: భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి ఆమె తల నరికేసి సరాసరి పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బెహ్‌జాం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉషాదేవి (50), రామ్ సేవక్ (52) దంపతులు. ఓ విషయంపై దంపతులు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రేకుడైన భర్త ఉషాదేవి తల నరికివేసి దాంతో సరాసరి పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. సేవక్‌పై హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్టు నీమ్‌గావ్ పోలీసు స్టేషన్ ఆఫీసర్ వెల్లడించారు. సేవక్ మానసిక స్థితి నిలకడగా ఉండేదికాదని, గతంలో ఓసారి సోదరుడిని వెంటాడి చంపబోయాడని గ్రామస్తులు తెలిపారు.